Ceasefire Russia Ukraine: ఉక్రెయిన్‌పై దాడులకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది రష్యా. ఆ దేశంలోని అనేక నగరాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా మానవతా కారిడార్ ఏర్పాటు కోసం ఈ నిర్ణణం తీసుకున్నట్లు రష్యా పేర్కొంది. కీవ్, ఖర్కివ్, మారియుపోల్, సుమీ నగరాలకు ఈ కాల్పుల విరమణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ అమలును డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపింది.
రష్యా తొలిసారిగా శనివారం మారియుపోల్, వోల్నవోఖ్ నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. కానీ రష్యా కాల్పుల విరమణను ఎక్కువ సేపు కొనసాగించలేదని.. దీని వల్ల చాలా మంది నగరం దాటి రాలేకపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఉల్లంఘనకు పాల్పడుతోంది..
కాల్పులను విరమణను రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు ఉక్రెయిన్ అధికారులు. మానవతా కారిడార్లపై దాడికి పాల్పడి.. మహిళలు, పిల్లలను బందీలు చేయడం సహా నగరాల్లోని నివాసిత ప్రాంతాలపై దాడి చేస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు ఇప్పటికే రెండు సార్లు ఉక్రెయిన్‌తో చర్చలు జరిపిన రష్యా.. సోమవారం మూడో విడత చర్చలు జరపనుంది.
ఇదీ చూడండి: ఆగని బాంబుల మోత.. ఉక్రెయిన్ను కమ్మేస్తున్న రష్యా సేనలు