ETV Bharat / international

బోల్తా పడి బస్సు నుజ్జునుజ్జు- 10మంది మృతి - రోడ్డు ప్రమాదం

బస్సు బోల్తా పడి నుజ్జునుజ్జు అయిన ఘటనలో 10 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం క్రొయేషియాలో జరిగింది.

bus crash
బస్సు ప్రమాదం
author img

By

Published : Jul 25, 2021, 4:05 PM IST

క్రొయేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. మరో 45 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం ఉదయం రాజధాని జాగ్రెబ్, సెర్బియా సరిహద్దు మధ్య ఉన్న స్లావోన్స్కీ వద్ద రహదారిపై బస్సు బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. దీంతో 60 మందికి పైగా ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల కారణం తెలియలేదు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో 8 మందికి తీవ్ర గాయలైనట్లు సమాచారం. ఈ ఘటనపై క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెన్​కోవిక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: ఘోర ప్రమాదంలో 32 మంది మృతి- రక్తసిక్తమైన రోడ్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.