ఈ నెల 12న ముగియనున్న బ్రెగ్జిట్ గడువును పొడిగించాలని ఐరోపా సమాఖ్యను కోరాలన్న తీర్మానానికి బ్రిటన్ పార్లమెంటులోని దిగువ సభ ఆమోదం తెలిపింది. ఒక్క ఓటు ఆధిక్యంతో ఇది సభను దాటింది. నేడు ఈ తీర్మానం ఎగువసభలో ప్రవేశపెట్టనున్నారు.
థెరిసా మే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బ్రెగ్జిట్ బిల్లును మూడు సార్లు తిరస్కరించింది పార్లమెంటు. ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేసినప్పటికీ ఒక్కదానికీ ఆమోదం లభించలేదు.
ఏప్రిల్ 12లోగా ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. ఒకవేళ ఎలాంటి ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఒప్పందం లేకుండానే నిష్ర్కమించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:బ్రెగ్జిట్‌పై అదే ప్రతిష్టంభన- రాజీనామాకు మే సిద్ధం