కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ నిరసన గళాన్ని వినిపించిన నేపథ్యంలో అక్కడి భారతీయ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మేరకు వారి తీర్మానాన్ని ఖండిస్తూ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు ఉమ్మడిగా లేఖ రాశాయి. ఇందులో బ్రిటన్ హిందూ సంఘం, భారత జాతీయ విద్యార్థి విభాగం(ఐఎన్ఎస్ఏ), ఇండియన్ ప్రొఫెషనల్స్ ఫోరం(ఐపీఎఫ్), వివిధ ఆలయ సంఘాలు ఉన్నాయి.
'కశ్మీర్ అంశంపై దీర్ఘకాలంగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కశ్మీర్ విషయంలో లేబర్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం' అని లేఖలో పేర్కొన్నారు ఆయా సంఘాల ప్రతినిధులు.
కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సెప్టెంబర్ 25న అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ. అంతర్జాతీయ పరిశీలకులు కశ్మీర్లో పర్యటించి.. ప్రజల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు కార్బిన్.
ఇదీ చూడండి:ఈక్వెడార్‌లో పెల్లుబికిన ప్రజాగ్రహం- కర్ఫ్యూ విధింపు