ETV Bharat / international

స్మార్ట్​ ఫోన్​తోనూ కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష! - phone screen testing covid

కరోనా నిర్ధరణ పరీక్షల్లో బ్రిటన్‌ శాస్త్రవేత్తల సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని చొప్పించాల్సిన అవసరం లేకుండానే కొవిడ్ పరీక్ష నిర్వహించడం దీని ప్రత్యేకత.! అనుమానితుల నుంచి నేరుగా నమూనాలను సేకరించడానికి బదులు వారి మొబైల్‌ స్క్రీన్ల నుంచి స్వాబ్‌లు సేకరించి దీనిని నిర్వహిస్తారు.

mobile swab covid test
స్మార్ట్​ ఫోన్​తోనూ కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష!
author img

By

Published : Jun 25, 2021, 8:20 AM IST

ఒక వ్యక్తిలో వైరస్‌ జాడను పసిగట్టేందుకూ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్‌ను వేగంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని చొప్పించాల్సిన అవసరం లేకుండానే ఈ పరీక్షను నిర్వహించొచ్చు. కచ్చితమైన ఫలితాన్ని పొందొచ్చు.

కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, నొప్పి కలిగించడం వంటి కారణాలు.. కొవిడ్‌ బాధితులను వేగంగా గుర్తించడంలో అవరోధంగా మారాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కారం చేశారు. ఈ విధానానికి 'ఫోన్‌ స్క్రీన్‌ టెస్టింగ్‌' (పోస్ట్‌) అని పేరు పెట్టారు. ఇందులో కొవిడ్‌ అనుమానితుల నుంచి నమూనాలను నేరుగా సేకరించడానికి బదులు వారి మొబైల్‌ స్క్రీన్ల నుంచి స్వాబ్‌లు సేకరించి, పరీక్షించారు.

ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్‌లకు నిర్వహించిన పీసీఆర్‌ పరీక్షలో 'కొవిడ్‌ పాజిటివ్‌'గా తేలినవారు ఈ కొత్త విధానంలోనూ పాజిటివ్‌గా తేలారు. ఈ విధానం ఆధారంగా.. ఫోన్ల నుంచి నమూనాలను సురక్షితంగా సేకరించి, వాటిని విశ్లేషించి, సంక్షిప్త సందేశం ద్వారా ఫలితాన్ని ఆ వ్యక్తికి నేరుగా చేరవేసేందుకు చిలీకి చెందిన అంకుర పరిశ్రమ 'డయాగ్నోసిస్‌ బయోటెక్‌' ఒక యంత్రాన్ని రూపొందిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.