ETV Bharat / international

కొత్త సంవత్సరం నుంచి కరోనా వ్యాక్సిన్! - బ్రిటన్ కరోనా వ్యాక్సీన్​

కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. ఈ తరుణంలో అందరి చూపు.. వ్యాక్సిన్​ వైపే ఉంది. అనేక దేశాలు టీకా తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే.. బ్రిటన్​లో వచ్చే ఏడాది ప్రారంభం నుంచే కొవిడ్​ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడి ఆరోగ్య రంగ నిపుణులు.

bitan is planning to release corona vaccine in next year starting
కొత్త సంవత్సరం నుంచి బ్రిటన్​లో కరోనా వ్యాక్సిన్​!
author img

By

Published : Oct 19, 2020, 5:30 AM IST

బ్రిటన్‌లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కొత్త సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను జనవరి నుంచే అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. క్రిస్మస్‌ ముగిసిన వెంటనే వ్యాక్సిన్‌ విడుదలకు సిద్ధంగా ఉండవచ్చనే విషయాన్ని బ్రిటన్‌ ఆరోగ్యరంగ నిపుణులు అక్కడి పార్లమెంట్‌ సభ్యులకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

" కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే ముమ్మర కృషి జరుగుతోంది. ఒకవేళ ప్రయోగాలు విజయవంతమైతే ఇది ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. అయితే, అన్ని వ్యాక్సిన్‌లు తప్పనిసరిగా మూడు దశల ప్రయోగాలను పూర్తి చేసుకుంటాయి. వీటిని ప్రజలకు అందించే ముందు నియంత్రణ సంస్థలు వాటి ఫలితాలను విశ్లేషించి అనుమతిస్తాయి. ఇది ఎంతో దూరంలో లేదు. "

- జొనాథన్‌ వాన్‌-టాన్‌, ఇంగ్లాండ్‌ డిప్యూటీ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్

వ్యాక్సిన్‌ సమర్థంగా, సురక్షితంగా ఉన్నట్లు నియంత్రణ సంస్థ ప్రకటించిన వెంటనే వీటిని విడుదల చేసేందుకు ఎంహెచ్‌ఆర్‌ఏ సన్నద్ధమవుతోంది. వ్యాక్సిన్‌కు లైసెన్స్‌ మంజూరు చేసే ఏజెన్సీల అవసరం లేకుండానే వీటిని నేరుగా ప్రజలకు అందించేందుకు వీలుగా హ్యుమన్‌ మెడిసిన్‌ రెగ్యులేషన్‌లలో కూడా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. అయితే, ప్రయోగాల్లో కచ్చితమైన ప్రమాణాలు పాటించిన అనంతరమే వ్యాక్సిన్‌లకు అనుమతిస్తామని ఎంహెచ్‌ఆర్‌ఏ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ క్రిస్టియన్‌ ష్నైడెర్‌ స్పష్టం చేశారు.

‘కరోనా ప్రమాదం ఎక్కువగా ఉన్నవారితో పాటు వయసు పైబడిన వారికి వ్యాక్సిన్‌ రక్షణ కల్పించడంతోపాటు యువకుల్లోనూ వైరస్‌కు అడ్డుకట్ట వేస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో జనవరి నుంచే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి’ అని ఓ ఎంపీ స్థానిక మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనికా తుది దశ ప్రయోగాలు భారత్‌లో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.