బిల్లుపై చర్చించేందుకు దిగువ సభ స్పీకర్ అంగీకరించారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టబోతున్న బిల్లు పూర్తిగా భిన్నమైందని ఆయన తెలిపారు. మే ప్రతిపాదించిన ఒప్పంద బిల్లును ఇప్పటికే రెండుసార్లు పార్లమెంటు తిరస్కరించింది.
విడిపోయిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఒప్పందాన్ని ఆమోదించాలని మే పట్టుబడుతున్నారు. దీనికోసం రాజీనామా అస్త్రాన్ని థెరిసా ప్రయోగించారు. బిల్లును వ్యతిరేకించే వారు కూడా ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయేందుకు మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో మే బిల్లును అంగీకరించాలని పార్లమెంటును కోరారు ప్రభుత్వ ప్రతినిధి ఆండ్రియా లీడ్సమ్. సమాఖ్య నుంచి మే 22న బ్రిటన్ వైదొలిగేలా సభ్యులు సహకరించాలన్నారు.