ETV Bharat / international

భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని- వచ్చేదెప్పుడంటే?

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. బోరిస్ ఏప్రిల్​లో భారత పర్యటన చేపడతారని తెలిపింది.

Boris Johnson to visit India in April as UK aims to counter China: Report
ఏప్రిల్​లో భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని
author img

By

Published : Mar 16, 2021, 8:58 AM IST

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్​లో భారత పర్యటనకు రానున్నారు. భారత్​లో అవకాశాలను విస్తృతం చేసుకోవడం సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో దూకుడు వైఖరి అవలంబిస్తున్న చైనాకు గట్టి సందేశం ఇచ్చేలా బోరిస్ ఈ పర్యటన చేపట్టనున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

అమెరికాతో ఉన్న బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే విధంగా రక్షణ, విదేశాంగ విధానాలను బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం రూపొందించనుంది. ఈ నేపథ్యంలోనే బోరిస్ పర్యటనపై ప్రకటన రావడం గమనార్హం.

బ్రెగ్జిట్ అనంతర అవకాశాల కోసం

ఈ సందర్భంగా ఇండో పసిఫిక్​ను ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు కేంద్ర బిందువుగా అభివర్ణించింది బ్రిటన్. బోరిస్ గత పర్యటన సందర్భంగా ఈ ప్రాంతంలో తమ ఎయిర్​క్రాఫ్ట్​ను మోహరించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రపంచపటంలో బ్రిటన్ స్థాయిపై దృష్టిసారించడం సహా బ్రెగ్జిట్ అనంతర పరిస్థితులలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బోరిస్ యత్నిస్తున్నారని పేర్కొంది.

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బోరిస్ రావాల్సి ఉన్నప్పటికీ.. బ్రిటన్​లో కరోనా విజృంభణ, కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రావడం వంటి కారణాల వల్ల అప్పుడు తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇదీ చదవండి: పెరిగిన తాజ్​మహల్ సందర్శన​ టిక్కెట్​ ధర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.