బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరో బిడ్డకు తండ్రి అయ్యారు. బోరిస్‌కు కాబోయే భార్య క్యారీ సైమండ్స్ బుధవారం ఉదయం లండన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. పూర్తిగా నెలలు నిండకుండానే శిశువు పుట్టినప్పటికీ.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు ప్రధాని దంపతుల అధికార ప్రతినిధి తెలిపారు. నేషనల్ హెల్త్ సర్వీస్ వైద్య బృందానికి బోరిస్- సైమండ్స్ ధన్యవాదాలు తెలిపినట్టు వెల్లడించారు.
కరోనాపై విజయం సాధించి తిరిగి ప్రధాని బాధ్యతలు చేపట్టిన బోరిస్‌కు ఇది కచ్చితంగా శుభవార్తే.
బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు బోరీస్ జాన్సన్, సైమండ్స్. బోరిస్ జాన్సన్ సారథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఒకప్పుడు కమ్యూనికేషన్ చీఫ్‌గా వ్యవహరించారు సైమండ్స్. ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులయ్యారు. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారట.
ఇప్పటికే జాన్సన్ రెండో భార్య మరీనా వీలర్‌కు నలుగురు పిల్లలు. 1993లో పెళ్లి చేసుకున్న వారిద్దరూ.. 2018లో విడిపోయి వేరుగా ఉంటున్నారు. అంతకుముందు... 1987లో అలెగ్రా మోస్టిన్ ఓవెన్‌ను వివాహం చేసుకున్నారు బోరిస్. తర్వాత కొన్నేళ్లగా విడిపోయారు.