ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో కొందరు దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం అదే ప్రాంతంలో మరిన్ని కత్తిపోటు ఘటనలు జరిగాయని వెస్ట్ మిడ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలవ్వగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఎంతమంది గాయపడ్డారనే విషయంపై స్పష్టత లేదు.
రహదారుల మూసివేత..
కత్తిపోట్ల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. సంఘటనా స్థలంలో అత్యవసర సిబ్బందిని మోహరించారు. ప్రజల్ని బయటకు రావొద్దని సూచిస్తూ రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. అయితే.. ఈ ఘటనకు కారకులెవరు? ఎందుకిలా చేశారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.