కాల్పుల విరమణకు కుదిరిన రెండో ఒప్పందాన్ని అర్మేనియా-అజర్‌బైజాన్ ఉల్లంఘించాయి. నాగోర్నో-కరాబఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం చేసుకుంటున్న దాడులను కొనసాగించాయి. కాల్పులు చేసినట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.
తాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు శనివారం ఆమోదం తెలిపాయి. సెప్టెంబర్ 27న భారీ కాల్పులు జరగడం వల్ల విరమణ ఒప్పందానికి అంగీకారానికి వచ్చాయి.
ఇదీ చదవండి- ఆర్మేనియా- అజర్‌బైజాన్ మధ్య నూతన ఒప్పందం
అయితే అజర్‌బైజాన్ సైనికదళాలు తుపాకులు, క్షిపణులతో ఆదివారం దాడులు చేశారని అర్మేనియా సైనిక అధికారులు ఆరోపించారు. ఘర్షణాత్మక ప్రాంతంలో రాత్రి సమయంలో దాడులు చేశాయని పేర్కొన్నారు. ఘర్షణ ప్రాంతానికి దక్షిణ దిశగా ఉదయం దాడి చేశారని అర్మేనియా రక్షణ శాఖ ప్రతినిధి సుషాన్ స్టెపానియన్ వెల్లడించారు. ఇరువైపులా ప్రాణ నష్టం సంభవించిందని తెలిపారు.
అయితే అర్మేనియా వ్యాఖ్యలను అజర్‌బైజాన్ రక్షణ శాఖ ఖండించింది. అర్మేనియా దళాలే కాల్పులు చేశాయని ఆరోపించింది. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతానికి దక్షిణ సరిహద్దు వెంబడి భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి- యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్ వివాదమేంటి ?