దేశ రాజధాని పారిస్‌లో నోటర్ డామ్ చర్చిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. ఐదేళ్లలో ఇంతకు ముందుకన్నా సుందరంగా రూపొందిస్తామని ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.
నోటర్ డామ్ చర్చిలో జరిగిన ప్రమాదం... దేశాన్ని ఒక్కటి చేసిందన్నారు మేక్రాన్. ఫ్రాన్స్‌లో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, మళ్లీ వాటిని నిర్మించామని గుర్తు చేశారు.
"గత రాత్రి మనం ఒక దగ్గరకు చేరుకోవడం, ఐక్యంగా ఉండటాన్ని గమనించాం" -ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు