బ్రెగ్జిట్తో సతమతమవుతున్న బ్రిటన్... సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ సంపాదించుకుని.. ఎట్టిపరిస్థితుల్లోనైనా బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ప్రధానికి, బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి విపక్ష పార్టీలు. ఇందులో భాగంగా మూడు చిన్న పార్టీలు ఏకమయ్యాయి. లిబరల్ డెమొక్రాట్స్, ది గ్రీన్స్, వెల్ష్ నేషనలిస్ట్ పార్టీలు కూటమిగా ఏర్పడి.. బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే అభ్యర్థులను గెలిపించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాయి. మొత్తం 650 సీట్లకు గాను 60 స్థానాల్లో పోటీ చేయనుంది ఈ కూటమి. వీటిలో కచ్చితంగా 40పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని కూటమి నేతలు విశ్వాసంగా ఉన్నారు.
2016లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది బ్రిటన్ ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అయితే బ్రెగ్జిట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలనే అంశంపై ఎంపీల్లో విభేదాలు ఎదురయ్యాయి. ఇందు వల్ల ఇప్పటికీ బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తి కాలేదు.
ఇదీ చూడండి: భీకర తుపానుకు గ్రీస్ గజగజ