బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నుంచి కార్మిక, పింఛను శాఖ మంత్రి అంబర్ రూడ్ వైదొలిగారు. బ్రెగ్జిట్‌పై బోరిస్ జాన్సన్ వైఖరికి నిరసనగానే తాను పదవి నుంచి తప్పుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రధాని బోరిస్‌కు రాసిన లేఖలో తాను 'రాజకీయ విధ్వంస రచన'ను సమర్థించలేనని అంబర్ రూడ్ పేర్కొన్నారు. పార్టీ విప్‌ను ధిక్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
బోరిస్ ఇటీవల 21 మంది అసమ్మతి ఎంపీలను తన పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో అంబర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పంద రహిత బ్రెగ్జిట్‌ను నివారించేలా బోరిస్ కొత్త చట్టం తెచ్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నందుకు వారిపై వేటు పడింది.
ఇదీ చూడండి: ఎన్ఆర్సీ తుది జాబితాపై ఆర్ఎస్ఎస్ ఆందోళన