చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్యూలో సుమారు 35 మంది ప్రయాణికులు ప్యాంటు ధరించకుండా మెట్రోలో ప్రయాణం చేశారు. ఇదేదో నిరసన తెలిపే కార్యక్రమం అనుకుంటే పొరబడినట్లే. 'నో ప్యాంట్ సబ్వే రైడ్' కార్యక్రమంలో భాగంగా వీరందరూ ఇలా మెట్రోలో ప్రయాణించారు. ఈ కార్యక్రమాన్ని 20 ఏళ్లుగా ఏటా నిర్వహిస్తున్నారు.
అందుకే ఈ నో పాంట్ షో..
రోజూ సెల్ఫోన్లు చూస్తూ కాలం గడపకుండా చుట్టూ ఉండే వాతావరణాన్ని గమనించేలా.. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు లండన్, న్యూయార్క్ నగరాలలోనూ జరుగుతుంటాయి.