సెంట్రల్ లండన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఓ ర్యాలీ నిర్వహిచారు. డౌన్ స్ట్రీట్‌ను ట్రంప్ సందర్శించిన తర్వాత ఈ ర్యాలీని నిర్వహించారు.
సెంట్రల్ లండన్‌లోని పార్లమెంటు ప్రాంగణాన్ని ట్రంప్ సందర్శించిన అనంతరం ఆయన మద్దతుదారులు చిన్నపాటి ర్యాలీలో "వీ లవ్ యూ ట్రంప్ " అనే బ్యానర్లు ప్రదర్శించారు.
అయితే ఈ ర్యాలీ ట్రంప్ వ్యతిరేక వాదులు, మద్దతుదారుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. పోలీసులు పర్యవేక్షిస్తుండగానే ఇరు వర్గాలూ పరస్పర మాటల యుద్ధానికి దిగాయి.
ఇదీ చూడండి: 'బ్రెగ్జిట్ తరువాత మెరుగైన వాణిజ్య ఒప్పందం'