ETV Bharat / international

ముగ్గురు పిల్లలను చంపి పోలీసులకు చెప్పిన తల్లి

author img

By

Published : Oct 18, 2020, 5:00 AM IST

తన పిల్లల పట్ల ఓ తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ముగ్గురు ఆడపిల్లలను బలితీసుకుంది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

KILLER MOTHER
ముగ్గురు పిల్లలను చంపిన తల్లి

ఆస్ట్రియాలోని వియాన్నాలో దారుణం జరిగింది. సొంత బిడ్డలపైనే ఓ తల్లి కర్కశత్వం ప్రదర్శించింది. 8 నెలల పసికందు సహా ముగ్గురు ఆడ పిల్లలను పొట్టనపెట్టుకుంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. తానూ ఆత్మహత్య చేసుకుంటాని తెలిపింది.

తన ముగ్గురు సంతానాన్ని హత్యచేశానని, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఓ 31ఏళ్ల మహిళ శనివారం ఉదయం పోలీసులకు ఫోన్‌ చేసింది. వెంటనే, ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న వియన్నా పోలీసులు గాయాలతో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదేళ్లు, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు బాలికల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కొన ప్రాణాలతో ఉన్న 8 నెలల చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. అయితే, ఆమె ఇంత దారుణానికి ఎందుకు పాల్పడిందో పోలీసులు ఇంకా నిర్ధరించలేదు.

ఇదీ చూడండి: ఉగ్రసంస్థలతో ఆ అధ్యక్షుడికి సన్నిహిత సంబంధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.