ETV Bharat / international

700 ఏళ్ల కిందటే భౌతిక దూరం, క్వారంటైన్‌

author img

By

Published : May 11, 2020, 9:29 AM IST

మన పూర్వీకులు దాదాపు 700 ఏళ్ల క్రితమే భౌతిక దూరం, క్వారంటైన్ నిబంధనల్ని పాటించారంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. అడ్రియాటిక్‌ సముద్రపు ఒడ్డున ఉన్న రగుస(ప్రస్తుతం దక్షిణ క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్‌) పట్టణంలో ప్రపంచంలోనే మొదటిసారిగా క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. ఐరోపాలో ముఖ్యంగా ఇటలీలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు కూడా అప్పటి వెనిస్, మిలాన్ అధికారులు ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నారు.

700 years ago People practiced physical distance and Quarantine
700 ఏళ్ల కిందటే... భౌతిక దూరం... క్వారంటైన్‌

కరోనా కట్టడికి ప్రస్తుతం మనం అనుసరిస్తున్న భౌతిక దూరం, క్వారంటైన్‌ నిబంధనల్ని దాదాపు 700 ఏళ్ల కిందటే పూర్వీకులు పాటించారు. అప్పట్లో ఐరోపా ఖండాన్ని ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది. ఇటలీలో 1348లో ప్లేగు ప్రభావం మొదలైంది. వెనిస్‌, మిలన్‌ నగరాల అధికారులు ప్రజారోగ్య పరిరక్షణకు అత్యవసరంగా పలు నిబంధనల్ని విధించారు. జనం ఒకరికి ఒకరికి మధ్య భౌతికదూరం పాటించాలనేది దాని సారాంశం. వస్తువుల ఉపరితలాలపై అంటుకున్న వైరస్‌ మనుషులకు సోకుతోందని వైద్యులు ఆనాడే గుర్తించారు. అందుకే వ్యాపార కార్యకలాపాలు, ఉత్పత్తులు, వస్తువుల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.

మొట్టమొదటి సారిగా...

అడ్రియాటిక్‌ సముద్రపు ఒడ్డున ఉన్న రగుస(ప్రస్తుతం దక్షిణ క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్‌) పట్టణంలో ప్రపంచంలోనే మొదటిసారిగా క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. నౌకాశ్రయానికి వచ్చే అన్ని ఓడల్లోని వ్యాపారులు, సిబ్బందికి ఏమైనా వ్యాధులు ఉన్నాయేమోనని వైద్య సిబ్బంది పరీక్షించి, కొంతకాలం పట్టణానికి దూరంగా ఉంచేవారు. ‘ప్లేగు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారికి రగుసలో ప్రవేశించేందుకు అనుమతి లేదు. ఓ నెల పాటు తప్పనిసరిగా సమీపంలోని ఎమర్కన్‌ దీవిలో కానీ పట్టణానికి దూరంగా ఉన్న కావ్‌టట్‌ అనే ప్రదేశంలో కానీ గడపాలి’ అంటూ 1377, జులై 27న రగుస మేజర్‌ కౌన్సిల్‌ వెలువరించిన చట్టం ప్రతి ఇప్పటికీ డుబ్రోవ్నిక్‌ ఆర్కైవ్స్‌లో భద్రంగా ఉంది. క్వారంటైన్‌లో ఉండే వారి కోసం వెదురు గృహాల్ని నిర్మించారు.

40 రోజుల క్వారంటినో...

మొదట్లో 30 రోజుల పాటు ఉండే క్వారంటైన్‌ వ్యవధిని ఆ తర్వాతి రోజుల్లో పలు దేశాల్లో 40 రోజులకు పెంచారు. క్వారంటైన్‌ అనే ఆంగ్ల పదం క్వారంటినో అనే ఇటాలియన్‌ పదం నుంచి వచ్చింది. క్వారంటినో అంటే 40 రోజుల వ్యవధి అని అర్థం. ఈ సంఖ్యకు ఆనాటి మతాచారాలు, సంప్రదాయాల్లో ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఈ మార్పు చోటుచేసుకున్నట్లు చరిత్రకారుల అభిప్రాయం.

ఇదీ చూడండి: ఆ రెండింటిని జోడిస్తే.. రికవరీ రేటులో మార్పు ఎంత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.