ETV Bharat / international

ఆ ఆరుగురు ఖైదీల మృతికి కారణమేంటి?

author img

By

Published : Mar 9, 2020, 11:32 PM IST

ఇటలీలో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జైళ్లలో పలు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఆంక్షలను నిరసిస్తూ.. రెండు డజన్ల​కుపైగా కారాగారాల్లో ఆందోళనలు చేపట్టారు ఖైదీలు. ఈ క్రమంలో ఓ జైలులో ఆరుగురు మృతి చెందారు.

protest over virus measures
జైళ్ల పైకి ఎక్కి ఆందోళన చేస్తున్న ఖైదీలు

కరోనా వైరస్​ భయంతో ఇటలీ విలవిలలాడుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని జైళ్లు అస్తవ్యస్తంగా మారాయి. సహజంగానే రద్దీగా ఉండే జైళ్లు.. వైరస్​ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కనీసం కుటుంబ సభ్యులను కలవలేని పరిస్థితి. ఈ చర్యలను తట్టుకోలేక కారాగారాల్లోని ఖైదీలు నిరసనలు చేపట్టారు. డజనుకుపైగా జైళ్లల్లో ఆందోళనలు సాగుతున్నాయి.

ఆరుగురు మృతి..

మోడేనాలోని ఓ జైలులో ఆరుగురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కారాగారంలోని ఓ ఆరోగ్య కేంద్రంలోకి అక్రమంగా చొరబడి... మెథడోన్ ​(ఓపియాయిడ్​)ను అధికంగా తీసుకోవడం వల్లే వీరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

మరోవైపు మిలాన్​లోని శాన్​ విట్టోర్​ జైలులో కారాగార భవనం పైకి ఎక్కి ఆందోళనలు చేపట్టారు ఖైదీలు. 'క్షమాపణలు చెప్పాలి' అన్న పెయింటింగ్​ను పట్టుకుని నినాదాలు చేశారు.

చర్యలు చేపట్టాలి..

పరిస్థితులను తక్షణమే చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఇటలీ ఖైదీల హక్కుల ప్రతినిధులు డిమాండ్​ చేశారు. కొత్త నిబంధనలను తొలగించాలని సూచించారు. కరోనా వైరస్​ వ్యాప్తితో ఖైదీల్లో ఆందోళనలు పెరిగాయని వెల్లడించారు.

కుటుంబ సభ్యుల ఆందోళన..

చెరసాలల్లో ఆందోళనలు చెలరేగి ఖైదీలు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంగా ఇటలీ రాజధాని రోమ్​లోని రెబిబ్బియా జైలు ముందు ఖైదీల కుటుంబ సభ్యులు నిరసనలు చేపట్టారు.

ఇదీ చూడండి: ఇరాన్​కు బయలుదేరిన భారత వైమానిక దళ విమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.