ETV Bharat / international

ముంచెత్తిన వరద- 19 మంది మృతి - floods news

జర్మనీలో భారీగా వరదలు పోటెత్తాయి. వరదల ఉద్ధృతికి 19 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. నీటి ప్రవాహానికి అనేక ఇళ్లు కూలిపోయాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోగా భారీ ఆస్తి నష్టం జరిగింది.

germany, floods
వరదలు, జర్మనీ
author img

By

Published : Jul 15, 2021, 4:49 PM IST

Updated : Jul 15, 2021, 7:07 PM IST

భారీగా పోటెత్తిన వరదలు

జర్మనీలో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదల ఉద్ధృతికి ఇప్పటికే 19 మంది మరణించగా.. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఏకధాటిగా కురుసిన వానలకు కొండ చరియలు విరిగిపడి ఎక్కువ ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.

వరదల ధాటికి ఇంటి ముందు పార్క్‌ చేసిన కార్లు కొట్టుకుపోయాయి. యూస్కిర్‌చెన్‌ కౌంటీలో 8 మంది మరణించారు. ఆ ప్రాంతంలో ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ అయ్యాయి. కొబ్లెంజ్‌ నగరంలో నలుగురు మృతిచెందారు. సుమారు 50 మంది ఇళ్ల పైకప్పులపై నిలబడి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ప్రాంతాల్లో చాలా మంది గల్లంతైనట్లు తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అనేక గ్రామాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. ఈ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి సమాచారం లేదని అధికారులు తెలిపారు.

floods in germany
ధ్వంసమైన ఇళ్లు
floods in germany
జలమయమైన జర్మనీ

ప్రమాదస్థాయిని మించి..

జర్మనీలోని చాలా నగరాలు, పట్టణాల్లో అధికారులు అత్యవసర పరిస్థితిని విధించారు. భారీ వరదల వల్ల పొరుగు దేశాలు కూడా ప్రభావితమయ్యాయి. కొలోన్‌లో నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండడం వల్ల దిగువన ఉన్న వందల గ్రామాలను ఖాళీ చేయించారు. అల్టెనా పట్టణంలో సహాయ చర్యల్లో పాల్గొన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చనిపోయారు. జర్మనీలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన నార్త్-రైన్ వెస్ట్‌ ఫాలియాలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. చాలా పట్టణాల్లో నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రధాన రహదారులు నీట మునిగాయని.. దక్షిణ, తూర్పు రైల్వే సేవలన్నీ నిలిపేశారని అధికారులు తెలిపారు.

floods in germany
కొట్టుకుపోయిన వాహనాలు

సమీప ప్రాంతాల్లోనూ..

జర్మనీ- బెల్జియం సరిహద్దుల సమీపంలోని పర్యటక ప్రాంతమైన వాల్కెన్‌బర్గ్‌ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల నేపథ్యంలో 70 మంది సైనికులను బెల్జియం సరిహద్దులకు తరలించారు.

floods in germany
ఇళ్ల నుంచి ప్రవహిస్తున్న నీరు

జర్మనీలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు.. రెండు నెలల పాటు కురిసిన వానలకు సమానమని అధికారులు తెలిపారు. మరో రెండు రోజులు భారీ వానలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరో 10 ప్రాంతాల్లో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.

floods in germany
వరదల్లో కొట్టుకుపోయిన కారు

టర్కీలోని నల్ల సముద్రం తీరంలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మరణించగా ఆరుగురు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. వరదల ధాటికి కార్లు కొట్టుకుపోయాయని, అనేక ఇళ్లు కూలిపోయాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Nepal Floods: నేపాల్​ వరదల్లో 38 మంది మృతి

Last Updated : Jul 15, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.