రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. సైజాన్ ప్రాంతంలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ట్రక్కు అదుపు తప్పి బస్సు వచ్చే మార్గంలోకి దూసుకుపోవడం వల్ల ప్రమాదం జరిగిందని వెల్లడించారు అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి సుప్రీం షాక్!