ETV Bharat / international

రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన బామ్మను కరోనా కాటేసింది - కరోనా వైరస్​ మృతుల సంఖ్య

హిల్డా చర్చిల్​.. బ్రిటన్​కు చెందిన 108ఏళ్ల వృద్ధురాలు కరోనా వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచింది. తన జీవితంలో రెండు ప్రపంచయుద్ధాలు, అతి ప్రమాదకరమైన స్పానిష్​ ఫ్లూనూ ఎదుర్కొన్న హిల్డా.. కరోనాను జయించలేకపోయింది. బ్రిటన్​లో కరోనా బారినపడ్డ అతిపెద్ద వయస్కురాలు.. వైరస్​ పాజిటివ్​గా తేలిన 24 గంటల్లోనే మృతిచెందడం గమనార్హం.

108-yr-old woman, who survived Spanish flu pandemic, becomes oldest in UK to die from coronavirus
రెండు ప్రపంచ యుద్ధాలు ఎదుర్కొన్నా.. వైరస్​ మింగేసింది
author img

By

Published : Mar 29, 2020, 6:06 PM IST

ఆమె కళ్లు.. రెండు ప్రపంచ యుద్ధాలను చూశాయి. ఆమె శరీరం అతి ప్రమాదకరమైన స్పానిష్​ ఫ్లూనూ తట్టుకుని నిలిచింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన ఆమె.. చివరికి కరోనా వైరస్​తో కన్నుమూసింది. ఆమె.. బ్రిట​న్​కు చెందిన 108ఏళ్ల హిల్డా చర్చిల్​.

అతి పెద్ద వయస్కురాలు...

బ్రిటన్​లో వైరస్​ బారిన పడిన అతి పెద్ద వయస్కురాలు చర్చిల్​. వచ్చే ఏప్రిల్​ 5న తన 109వ పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా.. శనివారం ఆమె మరణించారు. కరోనా పాజిటివ్​గా​ తేలిన 24 గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది.

1918లో స్పానిష్​ ఫ్లూ.. ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్​ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హిల్డా చర్చిల్​ 12నెలల సోదరి కూడా ఉంది. ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా హిల్డా.. పని కోసం సాల్ఫోర్డ్​కు వలస వెళ్లినట్టు ఆమె మనవడు ఆంటోనీ చర్చిల్​ తెలిపారు.

"ఆమెకు కావాల్సిన సమయంలో మేము అందుబాటులో ఉండలేకపోయాం. ఇదే అత్యంత విషాదకరం. ఎన్నోసార్లు మమ్మల్ని ఆదుకున్న ఆమెకు మేము అండగా నిలవలేకపోయం. ఈ ఘటన మాకు ఎంతో బాధాకరం. హిల్డా పుట్టిన రోజు కోసం మేము ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాం."

-- ఆంటోనీ చర్చిల్​, హిల్డా మనవడు.

కరోనా వైరస్​ ధాటికి బ్రిటన్​లో 1,019 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17వేల 089 మంది వైరస్​ బారిన పడ్డారు. వీరిలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ కూడా ఉన్నారు.

ఇదీ చూడండి:- గర్భిణికి కరోనా సోకితే.. పుట్టే బిడ్డ పరిస్థితి ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.