ETV Bharat / international

యుద్ధానికి నెల రోజులు.. రష్యా లక్ష్యం నెరవేరిందా..?

Russia Ukraine War: నెలరోజుల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌... తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఇప్పటిదాకా సాధించలేకపోయారు. ఉక్రెయిన్‌ సైనికుల ఉక్కు సంకల్పం ముందు ఆయన ఆయుధ శక్తి నీరసిస్తోంది! రష్యా దాడుల ధాటికి పలు నగరాలు ధ్వంసమవుతున్నా, ఆ కూలిన గోడలే మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ.. పుతిన్‌ సేనలకు ఉక్కపోత తెప్పిస్తున్నాయి. రాజధాని కీవ్‌లోకి వెళ్లేందుకు రష్యా వారాల తరబడి ప్రయత్నిస్తున్నా, ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇంతకీ పుతిన్‌ యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించారు? నెల రోజుల దాడులతో ఏం సాధించారు? ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఎందుకు గద్దె దించలేకపోయారు? అసహనానికి గురవుతున్న పుతిన్‌ మున్ముందు ఎలాంటి వ్యూహాల్ని అనుసరించొచ్చు? అనేవి ఇప్పుడు ఆసక్తికర అంశాలు.

russia ukraine war
russia ukraine war
author img

By

Published : Mar 24, 2022, 6:24 AM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూలురు తీవ్ర అణచివేతకు గురవుతున్నారనే సాకుతో యుద్ధాన్ని ప్రారంభించిన పుతిన్‌ అసలు లక్ష్యం మాత్రం.. రష్యా సరిహద్దుల దాకా నాటో కూటమి విస్తరణ జరగకుండా నిలువరించడం. తొలుత ఉక్రెయిన్‌ చుట్టూ లక్షన్నరకు పైగా సైనికులను, భారీగా ఆయుధాలను మోహరించారు. ఉమ్మడి సైనిక విన్యాసాల పేరుతో- మరో పొరుగుదేశం బెలారస్‌లోకి కూడా యుద్ధ విమానాలను, ఆయుధాలను, సైనికులను పంపారు. అనంతరం ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు ప్రాంతాలైన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర రిపబ్లిక్‌లుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రాంతాల పరిరక్షణకు శాంతి సేనలను పంపుతున్నానని చెబుతూ.. గత నెల 24న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగారు. తమ నగరాలపై హఠాత్తుగా వచ్చిపడుతున్న క్షిపణులతో హతాశుడైన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ- బలమైన శత్రువును ఎదుర్కొనేందుకు ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోశారు. తాను దేశం విడిచి పారిపోయేది లేదని, ఈ యుద్ధంలో అంతిమ విజయం తమదేనని ప్రజలను ఉత్తేజపరిచారు.

పుతిన్‌ సేనలపై పోరాడేందుకు ముందుకువస్తే ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. ఇందుకు వేలమంది పౌరులు స్పందించారు. ఆయుధాలు చేతబూని యుద్ధానికి దిగారు. నెల రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలపై క్షిపణులు, ఫిరంగులతో విరుచుకుపడి భీకర విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ దాడుల తీవ్రతను పెంచుతూ వస్తోంది. ఆఖరికి అత్యంత శక్తిమంతమైన హైపర్‌ సోనిక్‌ క్షిపణుల్నీ ప్రయోగిస్తోంది. ఈ ధాటికి ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు నేలమట్టమవుతున్నాయి. అనేకమంది చనిపోతున్నారు. పౌరులు ప్రాణాలు అరచేతపట్టుకుని వలసపోతున్నారు. భారీగా సైనిక, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినా.. ఉక్రెయిన్‌ సేనలు మాత్రం మడమ తిప్పలేదు. ఎత్తిన తల దించలేదు. జెలెన్‌స్కీ వివిధ దేశాల చట్టసభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సహాయాన్ని అర్థిస్తున్నారు. ఆయన వినతికి స్పందించి- పాశ్చాత్యదేశాలు పెద్దఎత్తున ఆయుధాలు, మానవతా సాయాన్ని అందిస్తున్నాయి. ఇంకోవైపు మాస్కోతో చర్చలకు సిద్ధమనీ, నాటోలో చేరబోమనీ.. లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ల స్వతంత్రతపై చర్చించేందుకు సిద్ధమనీ జెలెన్‌స్కీ సంకేతాలిచ్చారు.

russia ukraine war
.

చెమటోడ్చుతున్న రష్యా సేనలు..

ఉక్రెయిన్‌ను సులభంగానే చేజిక్కించుకోవచ్చని భావించిన రష్యా బలగాలకు.. జెలెన్‌స్కీ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. వేలాదిగా తరలివచ్చిన రష్యా ట్యాంకర్లను ముందుకు కదలనీయకుండా ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో పుతిన్‌ సేనలు యుద్ధ రీతిని మార్చుకుంటూ.. ఉక్రెయిన్‌లోని అణువిద్యుత్కేంద్రాలు, ప్రభుత్వ భవనాలపై విరుచుకుపడుతున్నాయి. భీకర దాడులతో వణుకు పుట్టిస్తున్నాయి. అయినా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో పట్టుసాధించలేక చెమటోడుస్తున్నాయి. 64 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్‌ను కీవ్‌ శివార్లకు తరలించినా, రాజధానిలోకి చొచ్చుకు వెళ్లడం కుదరలేదు. మాస్కో సేనలు ఇప్పటికీ కీవ్‌కు వాయువ్యంగా 15 కి.మీ. దూరంలో, తూర్పున 30 కి.మీ. దూరంలో నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో గంట సమయం కూడా పట్టని ఈ ప్రయాణాన్ని.. పుతిన్‌ బలగాలు నాలుగు వారాలైనా పూర్తిచేయలేకపోయాయి. దీన్ని ఉక్రెయిన్‌ విజయంగా యుద్ధ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

నెల రోజులు.. మిగిలింది విధ్వంసం

ఉక్రెయిన్‌పై నెల రోజుల కిందట సైనిక చర్యను ఆరంభించిన రష్యా.. ఇప్పటికీ దాడులను కొనసాగిస్తూనే ఉంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై నేటికీ పట్టు సాధించలేదు.

russia ukraine war
.

యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24

ఉక్రెయిన్‌ను వీడిన వారు: 35 లక్షలు

దేశంలోనే చెల్లాచెదురైన వారు: 65 లక్షలు

ఇళ్లు విడిచి వెళ్లిపోయినవారు: కోటి మంది

ఉక్రెయిన్‌కు నష్టం..

మొత్తం నష్టం: సుమారు రూ. 8.42 లక్షల కోట్లు(110 బిలియన్‌ డాలర్లు)

మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం.)

యుద్ధంలో రష్యాకు నష్టం ఇలా..

(ఉక్రెయిన్‌ రక్షణశాఖ వివరాల ప్రకారం)..

మరణాలు: సైనికులు:15,000, (రష్యా లెక్కల ప్రకారం 500)

ధ్వంసం: యుద్ధ విమానాలు: 99,

హెలికాఫ్టర్లు: 123

యుద్ధ ట్యాంకులు: 509,

సాయుధ సైనిక వాహనాలు: 1,556

ఆర్థిక ఆంక్షలు విధించినా..

అమెరికా సహా నాటో, ఈయూలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధించినా రష్యా దూకుడు తగ్గలేదు. ఉక్రెయిన్‌పై మాస్కో దాడిని ఖండిస్తూ ఐరాస భద్రతా మండలి, సాధారణ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్‌కు.. భారత్‌, చైనాలు దూరంగానే ఉండిపోయాయి. యుద్ధాన్ని వెంటనే విరమించాలని, చర్చల ద్వారా విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఉభయ దేశాలకూ పిలుపునిచ్చాయి. పలు ప్రపంచ దేశాలూ ఇదే సూచించాయి. సంక్షోభ పరిష్కారానికి రష్యా- ఉక్రెయిన్‌ ప్రతినిధులు పలు దఫాలు చర్చలు జరిపినా.. ఫలితం దక్కలేదు.

'ప్లాన్‌-బి' ప్రతిపాదించనున్న పుతిన్‌?

యుద్ధంలోని తదుపరి అంకం మరింత భీకరంగా ఉండవచ్చని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న వ్యూహ రూపకల్పన సంస్థ సీఎన్‌ఏ విశ్లేషకుడు మైకేల్‌ కోఫ్‌మన్‌ అభిప్రాయపడ్డారు. రాజధాని కీవ్‌ను కొల్లగొట్టి, జెలెన్‌స్కీ సర్కారు స్థానంలో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్‌ భావించినట్టు చెబుతున్నారు. ఇవేవీ సాకారమయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో- పుతిన్‌ 'ప్లాన్‌-బి'ను ప్రతిపాదించే అవకాశముందని భావిస్తున్నారు. అందులోని ప్రధాన డిమాండ్లు..

1) పశ్చిమ దేశాలు-రష్యా పట్ల ఉక్రెయిన్‌ తటస్థ వైఖరిని అనుసరించాలి

2) నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరకూడదు.

3) ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు భూభాగాల విషయంలో రష్యా వాదనలను కీవ్‌ అంగీకరించాలి.

4) లేనిపక్షంలో రష్యా ఇప్పటివరకూ ఆక్రమించిన భూభాగాల నుంచి వెనక్కు వెళ్లదు.

ముగింపు ఎప్పుడు..ఎలా?

యుద్ధానికి ముగింపు ఎప్పుడు, ఎలా ఉండబోతుందనే స్పష్టత రావడం లేదు. పుతిన్‌తో చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని ఉక్రెయిన్‌ పదేపదే చెబుతోంది. కొంత మెత్తబడ్డ వైఖరిని జెలెన్‌స్కీ కనపరుస్తున్నారు. మధ్యవర్తిత్వ బాధ్యతలకు కొందరు తటస్థ ప్రముఖులూ ముందుకు వస్తున్నారు. ప్రపంచ దేశాల ఒత్తిడికి పుతిన్‌ తలొగ్గుతారా లేదా అనే దానిని బట్టి చర్చలు, ఒప్పందం, యుద్ధ విరమణ ఆధారపడి ఉంటాయి.

రష్యా లక్ష్యం ఎంతవరకు నెరవేరింది?

ఉక్రెయిన్‌లో రష్యా గత నాలుగు వారాల్లో పూర్తిగా పట్టు సాధించింది.. దక్షిణ ప్రాంతంలోని ఖేర్సన్‌ నగరంపై మాత్రమే. తూర్పున ఉన్న మేరియుపొల్‌ను ముట్టడించినా, సంపూర్ణ నియంత్రణ సాధించలేదు. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద పట్టణమైన ఖర్కివ్‌పైనా రోజుల తరబడి బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. చెర్నిహైవ్‌లో కొంత భాగాన్ని, అక్కడి అణు విద్యుత్‌ కేంద్రాన్ని పుతిన్‌ సేనలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ల్లోకి రష్యా సైన్యం మొదట్లోనే చొచ్చుకు వెళ్లింది. నల్లసముద్ర తీరంపై పట్టు సాధించేందుకు మొదట్లో గట్టిగానే ప్రయత్నించి, కొంతవరకూ సఫలమైంది. మాస్కో ఇక్కడ ఆధిపత్యం చాటుకుంటే, సముద్ర తీరాన్ని ఉక్రెయిన్‌ పూర్తిగా కోల్పోయినట్టువుతుంది. సైన్యం-వాయుసేన మధ్య సమన్వయలోపం, సాయుధ బలగాల్లో కచ్చితత్వం లోపించడం కూడా కారణమని ఫ్రాన్స్‌ సైనికాధికారులు చెబుతున్నారు.

russia ukraine war
.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు.. ఐరోపాకు బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.