ETV Bharat / international

చైనాలో కరోనా 2.0​- వుహాన్​లో మళ్లీ ఆంక్షలు!

కరోనాకు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్​లో ఇటీవలే లాక్​డౌన్ ఆంక్షలు సడలించినా.. వైరస్​ భయాలు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. రెండోసారి కొవిడ్​ 19 వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది.

fears of corona virus rebound in China
చైనాలో ముందస్తు చర్యలు
author img

By

Published : Apr 4, 2020, 9:36 AM IST

కరోనా వైరస్​.. చైనాలోని వుహాన్​లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అయితే వుహాన్​లో దాదాపు మూడు నెలల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే వుహాన్​లో లాక్​డౌన్​ను ఎత్తివేశారు. అయినా ప్రజల్లో ఆందోళనలు మాత్రం పోలేదు. ఇందుకు కారణం.. కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తుందనే భయం.

ఎలాంటి లక్షణాలు లేకపోయినా వైరస్​ పాజిటివ్​గా తేలిన కేసుల సంఖ్య చైనాలో రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వుహాన్​లో లాక్​డౌన్​ తొలగించినా... ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.

రవాణా...

వుహాన్​లో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ఈ నెల 8 నుంచి 100 ప్యాసింజర్​ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వుహాన్​ నుంచి విమాన సేవలూ ప్రారంభమవుతాయని చైనా ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి:కోలుకున్నవారి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.