ETV Bharat / bharat

కోలుకున్నవారి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందా?

కరోనా కల్లోలంలో ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న మరో ప్రశ్న... ఈ మహమ్మారి ఒకసారితోనే పోతుందా..? మళ్లీ తిరగబెట్టే ‌ప్రమాదం ఉందా? ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షన్నరకు పైగా బాధితులు కోలుకున్నారు. వారితో మళ్లీ ఏమైనా సమస్యలు వస్తాయా...? అన్నదే ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వారి నుంచి వ్యాధి వ్యాపించేందుకు అవకాశం ఉందని.. పరిశోధనల్లోనూ ఇదే తేలిందని చెబుతున్నారు నిపుణులు.

virus reactivate
కరోనా వైరస్
author img

By

Published : Apr 3, 2020, 6:08 PM IST

Updated : Apr 3, 2020, 6:35 PM IST

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తూ ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కరోనా బాధితులను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి నుంచి కొందరు క్రమంగా కోలుకుంటున్నారు.

వారంతా వైరస్ నుంచి పూర్తిగా బయటపడినట్లేనా అన్న సందేహాలు వస్తున్నాయి. వారు తిరిగి ఆ మహమ్మారి బారినపడేందుకు అవకాశం ఉందన్న కొన్న హెచ్చరికలే అందుకు కారణం.

కరోనా బాధితుల్లో వైరస్‌ ఎంతకాలం జీవించి ఉంటుందని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇందుకోసం చికిత్స తరువాత క్షేమంగా బయటపడిన కొందరి ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారు. వీరి గొంతు నుంచి సేకరించిన నమూనాలు విశ్లేషించారు.

కోలుకున్నా 8 రోజులపాటు..

వ్యాధి లక్షణాలు తగ్గిన తరువాత కూడా దాదాపు సగం మంది రోగులు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లెక్కన తీవ్ర స్థాయి ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నవారు ఇంకా ఎక్కువ కాలంపాటు ఈ వైరస్​ను వ్యాప్తి చేస్తుండొచ్చుని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిశోధనల ప్రకారం... కరోనా బాధితులు క్షేమంగా బయటపడినప్పటికి వారిలో కరోనా వైరస్‌ 8 రోజుల పాటు సజీవంగానే ఉంటుందిని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా వారు పూర్తిగా కోలుకునే వరకు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. చైనాలో కరోనా నుంచి కోలుకున్న వారిని పెద్దసంఖ్యలో డిశ్చార్జ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ పరిశోధనలకు మరింత ప్రాధాన్యం పెరిగింది.

నిద్రాణ స్థితి నుంచి..

కరోనా నుంచి కోలుకున్న వారు కొన్ని రోజులపాటు అప్రమత్తంగా లేకపోతే ఇతరులను కూడా ప్రమాదంలో పడేసే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్‌ తమ శరీరంలో పూర్తిగా నశించేవరకూ ఇతరులతో కలవ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

చికిత్స కారణంగా పూర్తిగా లొంగకపోయినా నిద్రాణ స్థితికి చేరుకునే వైరస్‌ మళ్లీ విజృంభించే ముప్పు ఉందన్నది నిపుణుల మాట. చైనాలో ఫిబ్రవరి 10 న నయమై డిశ్చార్జ్ అయినా ఒక బాధితుడి ఇలానే 10 రోజుల తర్వాత మళ్లీ కరోనా పాజిటివ్‌ అని తేలింది.

తిరగబెట్టే అవకాశం..

సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకే ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కొవిడ్-19 మాత్రం కొన్నిసార్లు మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

జపాన్‌లో కరోనా సోకిన మరో వృద్ధుడి విషయంలోనూ ఇదే తేలింది. ఆయనకు చికిత్స అందించి సాధారణ స్థితికి చేరుకున్నాక డిశ్ఛార్జి చేశారు. ఆరోగ్యంగా ఉన్నానని భావించిన ఆ పెద్దాయన రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాడు. కొన్ని రోజులకు జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్లగా కరోనా పాజిటివ్‌ అని తేలింది.

14 శాతం మందికి..

కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో కనీసం 14% మందికి తర్వాత పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్ అని వస్తోందని 'స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ'కి చెందిన నిపుణులూ చెబుతున్నారు. అయితే ఇది వారికి రెండోసారి వైరస్‌ సోకినట్లు తాము భావించట్లేదని వైరస్ తిరగబెట్టడం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారని పరిశోధకులు తెలియజేస్తున్నారు. వారిలో కరోనా వైరస్‌ నమూనాలు కొన్ని రోజులపాటు అలాగే ఉంటున్నాయని స్పష్టం చేస్తున్నారు.

రెండోసారి పరీక్ష అవసరం..

కరోనా నుంచి కోలుకున్నప్పటికి ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నందున వారంతా 2 వారాలపాటు క్వారంటైన్‌లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. కరోనా వేగంగా విస్తరించటానికి ఇదొక కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఒకసారి కోలుకున్న తరువాత మళ్లీ వారిని పరీక్షించకపోవడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.

ఇదీ చూడండి: భారత్​పై కరోనా పంజా... నెమ్మదిగా మొదలై

Last Updated : Apr 3, 2020, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.