ETV Bharat / international

తగ్గని కరోనా ఉద్ధృతి- అమెరికాలో 57 లక్షల కేసులు - కరోనా వైరస్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 2,26,27,039 మందికి వైరస్​ సోకింది. మొత్తం మీద 7,91,885 మంది వైరస్​కు బలయ్యారు. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది.

Worldwide corona virus pandemic situation
తగ్గని కరోనా ఉద్ధృతి- అమెరికాలో 57లక్షల కేసులు
author img

By

Published : Aug 20, 2020, 7:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,26,27,039 మందికి కరోనా​ సోకింది. వైరస్ ధాటికి 7,91,885 మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా విలవిల...

అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 947 తాజా కేసులతో కరోనా బాధితుల సంఖ్య 57,01,878కు చేరింది. మరో 40మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ దేశంలో మృతుల సంఖ్య 1,76,377కు పెరిగింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 30,63,252మంది వైరస్​ను జయించి ఇళ్లకు చేరారు.

పాక్​లో...

పాకిస్థాన్​లో 513 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 2,90,958కు పెరిగింది. 24 గంటల్లో 8 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,209కు చేరింది.

నేపాల్​లో...

నేపాల్​లో కొత్తగా 707 కేసులు బయటపడ్డాయి. ఒక్క కాఠ్​మాండూలోనే 200 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా కేసుల సంఖ్య 29,645కు చేరింది. దేశంలో మృతుల సంఖ్య 126గా ఉంది.

దేశంకేసులుమృతులు
అమెరికా57,01,8781,76,377
బ్రెజిల్​34,60,4131,11,189
రష్యా9,42,10616,099
దక్షిణాఫ్రికా5,96,06012,423
పెరూ5,58,42026,834
మెక్సికో5,37,03158,481
కొలంబియా5,02,17815,979
చిలీ3,90,03710,578
స్పెయిన్​3,87,98528,797

ఇదీ చూడండి:- కరోనా, సాధారణ జలుబు మధ్య తేడా ఇదే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.