ETV Bharat / international

విరాళమిస్తే 'బుర్జ్​ ఖలీఫా'పై మీకోసం లైట్లు వెలిగిస్తారు - corona latest updates

కరోనాపై పోరులో విరాళాల సేకరణకు వినూత్న ప్రయత్నం చేసింది యూఏఈ. ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనాన్ని వెలుగులతో ప్రకాశింప జేయనుంది. 828 మీటర్ల ఎత్తున్న ఈ టవర్​లో ఒక్కో మీల్​ ప్యాకెట్​ విరాళానికి ఒక్కో ఎల్​ఈడీ లైట్​ను వెలిగించాలని నిర్ణయించింది.

worlds-tallest-tower
కరోనా విరాళాలతో వెలుగులు విరజిమ్మనున్న అతిపెద్ద టవర్​
author img

By

Published : May 3, 2020, 11:06 PM IST

కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారాన్ని అందించేందుకు వినూత్న రీతిలో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది యూఏఈ ప్రభుత్వం. ఆ దేశంలోని ప్రపంచంలోనే అతిఎత్తయిన ది బుర్జ్ ఖలీఫా భవనాన్ని మొత్తం 12లక్షల ఎల్​ఈడీ లైట్ల వెలుగులతో ప్రకాశింపజేయనుంది.

దుబాయ్​లో ఉన్న ఈ టవర్​ ఎత్తు 828 మీటర్లు(2,717 అడుగులు). ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డొనేషన్​ బాక్స్​గా అవతరించనుంది. ఈ కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజల ఆకలి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది దుబాయ్​ ప్రభుత్వం. విరాళమిచ్చిన ప్రతి 10 దిర్హామ్​(2.7డాలర్లు)లకు ది బుర్జ్​ ఖలిఫా భవనానికి ఉన్న 12 లక్షల ఎల్​ఈడీ లైట్లలో ఒక్కో దాన్ని వెలిగించనుంది. ఇలా విరాళాలు వెల్లువెత్తే కొద్ది ఎల్​ఈడీ లైట్లన్నీ వెలిగి భవనం కాంతులతో విరాజిల్లనుంది. పవిత్ర రంజాన్​ మాసం సందర్భంగా ఎంతో మందికి సాయం అందించవచ్చని ఈ ఆలోచన చేసింది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే 1,76,000 మందికి భోజనం అందించేందుకు విరాళాలు సమకూరాయి.

యూఏఈలో ఇప్పటివరకు 14,000 మందికి వైరస్​ సోకింది. 126 మంది ప్రాణాలు కోల్పోయారు. గతవారమే పలు ఆంక్షలను సడలించింది ప్రభుత్వం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.