ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 52 లక్షల 34 వేల 140 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా 3,35,730మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. కొవిడ్ నుంచి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 21 లక్షల 12వేల 123కు చేరింది.
రష్యాలో అత్యధికంగా
రష్యాలో ఒక్కరోజులోనే సూమారు 9,000 కేసులు నమోదయ్యాయి. రోజువారి కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా 150 మంది వైరస్‌తో మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 3,26,448కి చేరింది.
బ్రిటన్‌లోనూ..
బ్రిటన్‌లో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. కొత్తగా 3,287 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో వైరస్ బారిన పడినవారి సంఖ్య 2,57,482కు పెరిగింది. మరో 351 మంది మృతి చెందగా... మరణాల సంఖ్య 36,744కు చేరుకుంది.
అమెరికాలో
అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజులో 1,289 కేసులు నమోదు కాగా.. వైరస్ బాధితలు సంఖ్య 16లక్షల 22వేల191కి చేరింది. గత 24 గంటల్లో 31 మంది మరణించగా.. వైరస్ మృతుల సంఖ్య 96,385కు పెరిగింది.
సౌదీ అరేబియా
కొత్తగా 2,642 కేసులు నమోదు కాగా... మొత్తం బాధితుల సంఖ్య 67,719కి చేరింది. మరో 13 మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 364కు పెరిగింది.
పాకిస్థాన్
గత 24 గంటల్లో 2,603 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించగా... కేసుల సంఖ్య 50,694కు పెరిగింది. ఇప్పటివరకు 1,067 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మెక్సికో
మెక్సికోలో వైరస్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,973 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం బాధితుల సంఖ్య 59,567కు చేరింది. మరో 420 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,510కి పెరిగింది.
ఇరాన్
ఇరాన్లో మరో 2,311 మందికి వైరస్ సోకగా.. మొత్తం 1,31,652 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 51 మంది మరణించారు. మృతుల సంఖ్య 7,300 చేరింది.
సింగపూర్
కొత్తగా 614 కేసుల నమోదవడం వల్ల మొత్తం కేసుల సంఖ్య 30వేలు దాటింది. మరో 23 మంది మరణించారు.
నేపాల్
నేపాల్‌లో కొత్తగా 50 మందికి వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 507కు పెరిగింది. ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 70 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 434 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చైనాలో మళ్లీ..
చైనాలో మరో నలుగురుకి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,971కి పెరిగింది. 4,634 మంది కరోనాతో మృతి చెందారు. తొలి దశ కేసుల్లో కేవలం 82 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం చైనాలో లక్షణాలు లేని రెండో దశ కేసులు ఎక్కువ అవుతున్నాయి.
ఇదీ చూడండి: ఈ ఫిల్టర్ పెట్టుకుంటే మాస్కు మార్చక్కరలేదు!