ETV Bharat / international

కరోనాపై పోరులో భారత్​కు 100 కోట్ల డాలర్ల సాయం

కొవిడ్‌పై పోరులో భారత్‌కు ప్రపంచ బ్యాంకు 100 కోట్ల డాలర్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. మరో 40 దేశాలకు కూడా ఆర్థిక ఉద్దీపన అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిధులు ల్యాబ్​ల సామర్థ్యం పెంచడానికి, పీపీఈల కొనుగోలుకు, కొత్త ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు ఉపయోగపడతాయి. ఫలితంగా కాంటాక్ట్​లను గుర్తించడానికి, సమర్థంగా వైరస్ స్క్రీనింగ్ చేయడానికి వీలవుతుంది.

World Bank approves USD 1 billion emergency funds for India to tackle COVID-19 outbreak
కరోనాపై పోరులో భారత్​క 100 కోట్ల డాలర్ల సాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంకు
author img

By

Published : Apr 3, 2020, 10:37 AM IST

భారత్​లో కరోనా వైరస్​ కట్టడికి ప్రపంచ బ్యాంకు 100 కోట్ల డాలర్ల అత్యవసర సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన ప్రక్రియకు ఆమోదం తెలిపింది.

ప్రపంచ బ్యాంకు గతంలోనే 25 దేశాలకు సాయం అందించేందుకుగాను 190 కోట్ల డాలర్లు ప్రాజెక్ట్​కు పచ్చజెండా ఊపింది. ఇప్పుడు మరో 40 దేశాలకు సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకు అందించే ఈ ఆర్థిక సాయంలో సింహభాగం భారత్​కు అందుతుంది.

"ఈ నిధులతో భారత్​లో ల్యాబ్​లో సామర్థ్యం పెంచడానికి, పీపీఈల కొనుగోలుకు, మరిన్ని ఐసోలేషన్​ వార్డులు సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా కరోనా వైరస్ స్క్రీనింగ్​ను మరింత సమర్థంగా చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే కాంటాక్ట్​లను గుర్తించడం సులభమవుతుంది." - ప్రపంచ బ్యాంకు

దక్షిణాసియా దేశాలకు...

దక్షిణాసియా దేశాలైన పాకిస్థాన్​కు 200 మిలియన్ డాలర్లు, అఫ్గానిస్థాన్​కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్​ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది.

వచ్చే 15 నెలల్లో పూర్తిగా కరోనా వైరస్​ను కట్టడికి, ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజానికి... 160 బిలియన్​ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీని అందించడానికి ప్రపంచ బ్యాంకు కృషి చేస్తోంది.

ఇదీ చూడండి: 'ఐకమత్య వెలుగులతో కరోనా చీకట్లపై పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.