ETV Bharat / international

టీకా తీసుకుంది.. రూ.5 కోట్లు గెలుచుకుంది..! - ఆస్ట్రేలియా యువతికి ఐదు కోట్లు

ఆస్ట్రేలియాలో (Vaccine Lottery Australia) వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి నిర్వహించిన లాటరీలో పాల్గొన్న ఓ 25ఏళ్ల యువతి లక్కీ డ్రా సొంతం చేసుకొని ఒకేసారి కోటీశ్వరురాలు అయ్యింది. తాజాగా తీసిన లాటరీలో జాన్నే ఝు అనే సిడ్నీ యువతి రూ.5.4కోట్ల నగదు బహుమతి గెలుచుకుంది.

Woman wins 5.4 cr after getting Covid 19 vaccine
టీకా తీసుకుంది.. రూ.5 కోట్లు గెలుచుకుంది..!
author img

By

Published : Nov 10, 2021, 4:34 AM IST

కొవిడ్‌ వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే టీకా పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో వ్యాక్సిన్‌లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఆయా ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనూ (Vaccine Lottery Australia) వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి లాటరీ ద్వారా నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇందులో పాల్గొన్న ఓ 25ఏళ్ల యువతి లక్కీ డ్రా సొంతం చేసుకొని ఒకేసారి కోటీశ్వరురాలు అయ్యింది. తాజాగా తీసిన లాటరీలో జాన్నే ఝు అనే సిడ్నీ యువతి రూ.5.4కోట్ల నగదు బహుమతి గెలుచుకుంది.

ఆస్ట్రేలియాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రోత్సహించేందుకు అక్కడి 20 కార్పొరేట్‌ సంస్థలు, దాతలు కలిసి 'మిలియన్‌ డాలర్‌ వ్యాక్స్‌' కూటమిగా ఏర్పడి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రోజువారీ లాటరీలో నగదు బహుమతితోపాటు ఒక మిలియన్‌ డాలర్ల (ఆస్ట్రేలియన్‌ డాలర్‌) నగదును లక్కీ విజేతకు అందజేస్తామని ప్రకటించారు. దీనికి స్థానికంగా విశేష స్పందన లభించింది. చివరి తేదీని అక్టోబర్‌ 31గా ప్రకటించగా.. దాదాపు 3600 పోస్టల్‌ కేంద్రాల నుంచి 27లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో సిడ్నీకి చెందిన జాన్నే ఝు (25) అనే యువతిని పదిలక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్ల (రూ.5.4కోట్ల) లక్కీ డ్రా వరించింది. తాజాగా ఈ నగదును సదరు యువతికి అందించినట్లు 'మిలియన్‌ డాలర్‌ వ్యాక్స్‌' నిర్వాహకులు పేర్కొన్నారు.

4.2 మిలియన్‌ డాలర్లతో ప్రోత్సాహకాలు..

ఆస్ట్రేలియాలో 'మిలియన్‌ డాలర్‌ వ్యాక్స్‌' కార్యక్రమాన్ని అక్టోబర్‌ తొలివారంలో ప్రారంభించారు. దీంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇది మొదలైన 24గంటల్లోనే మూడున్నర లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. కనీసం ఒక డోసు తీసుకున్న వారు కూడా దీనికి అర్హులని చెప్పడంతో ప్రజలు మరింత ఆసక్తి చూపించారు. దీంతో ఒకానొక సమయంలో ఆ వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగి క్రాష్‌ అయ్యింది. అనంతరం వెబ్‌సైట్‌ను పునరుద్ధరించిన నిర్వాహకులు.. అక్టోబర్‌ చివరి వరకూ రిజిస్ట్రేషన్‌ కొనసాగించారు. అదే సమయంలో వెయ్యి డాలర్ల విలువగల రోజువారీ నగదును పంపిణీ చేశారు. నవంబర్‌ 5న మిలియన్‌ డాలర్‌ లక్కీ డ్రా తీయగా.. సిడ్నీకి చెందిన జాన్నే ఝు విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమం కోసం మొత్తం 4.2మిలియన్‌ డాలర్లను కేటాయించారు. దీని ద్వారా దాదాపు 3100 లక్కీ విజేతలకు రోజువారీగా బహుమతులు అందజేశారు.

ఇదీ చూడండి: భారత సంతతి వ్యక్తిని 'ఉరి' నుంచి కాపాడిన కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.