ETV Bharat / international

భారీ కొండచిలువతో మహిళ ఫేస్​2ఫేస్​- సూపర్​ మార్కెట్​ షెల్ఫ్​లో... - ఆస్ట్రేలియా

సరకుల కోసం సూపర్​మార్కెట్​కు వెళ్తారు. మీకు కావాల్సినవి వెతుకుతున్నారు. ఓ షెల్ఫ్​ వద్ద అటుఇటూ చూస్తున్న మీకు అందులోంచి ఒక్కసారిగా 10అడుగుల కొండచిలువ ఎదురుపడితే? వెన్నులో వణికిపుట్టి హడలిపోతారు కదూ! సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఆస్ట్రేలియాలో ఓ మహిళకు ఎదురైంది. అయితే ఆమె భయపడలేదు. ఏం చేసిందో తెలిస్తే వారెవ్వా అనకమానరు.

supermarket snake
సూపర్​మార్కెట్​లో పాము
author img

By

Published : Aug 18, 2021, 7:46 PM IST

సూపర్​మార్కెట్​ షెల్ఫ్​లో కొండచిలువ కలకలం

ఓ సూపర్​ మార్కెట్​లో కొండచిలువ కలకలం రేపింది. షాపింగ్​ చేస్తున్న మహిళకు అనూహ్యంగా ఎదురుపడింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

ఒక్కసారిగా ఎదురుపడి..

సిడ్నీలోని వూల్​వర్త్స్ మార్ట్​లో హెలైనా అలటీ అనే మహిళ తనకు కావాల్సిన సరకుల కోసం వెతుకుతోంది. తొలుత ఆమెకు పామును చూడలేదు. ఎందుకంటే అది జాడీల వెనక దాగి ఉంది. ఈ క్రమంలోనే ఆమె కుడివైపు తిరగగా ఒక్కసారిగా 10 అడుగుల పైథాన్​ తలను బయటకు పెట్టేసింది.

అయితే పాముల గురించే ఇదివరకే శిక్షణ పొందిన అలటీ.. ముందు దానిని చూసి షాక్​ అయినా బెదరలేదు. కొండచిలువను గుర్తించిన వెంటనే అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి, దూరంగా పంపింది.

అయితే మార్ట్​​ సిబ్బందికి కొండచిలువ గురించి చెప్పేముందు దానిని వీడియో తీసినట్లు తెలిపారు అలటీ. తన పాముల సంచిలో దానిని బంధిస్తానని మార్ట్​ సిబ్బందికి చెప్పినప్పుడు వారు నమ్మలేదట. పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్లి బ్యాగు తీసుకొచ్చిన అలటీ.. పైథాన్​ను పట్టేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది.

పామును చూడగానే అది విషంలేనిదని, ప్రమాదమేమీ కాదని గుర్తించినట్లు అలటీ తెలిపింది. అది మగది అని, తోడు కోసం వచ్చి ఉంటుందని చెప్పింది.

ఇదీ చూడండి: ఇంట్లో 'కోబ్రా'ల మకాం.. తవ్వినకొద్దీ బయటకు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.