షరియా చట్టాలను ఉల్లంఘించి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి ఇండోనేసియాలో కఠిన శిక్షలు (Sharia Law Punishment) విధించారు. దోషులుగా తేలిన మహిళ, పురుషుడిని (Indonesia Sharia law Aceh) కర్రలతో దండించారు.
వీరిద్దరినీ ఈ ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు అధికారులు. వివాహం చేసుకోకుండానే లైంగిక సంబంధాలు సాగిస్తున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదుతో ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని దోషులుగా తేల్చి (Indonesia sharia punishment).. ఒక్కొక్కరి వీపుపై 17 సార్లు కర్రతో కొట్టారు. దీంతో పాటు ఇరువురికీ మూడు నెలల చొప్పున జైలు శిక్ష విధించారు.
సందర్శకులూ చట్టాన్ని గౌరవించాల్సిందే..
'బండా ఆచే' డిప్యూటీ మేయర్ జైనాల్ అరిఫిన్ సమక్షంలో శిక్షా కార్యక్రమం జరిగింది. ఇలా చేయడం వల్ల ఇతరులు ఇలాంటి తప్పులు చేయరని అరిఫిన్ చెప్పుకొచ్చారు. ఆచే రాష్ట్రాన్ని సందర్శించేవారు షరియా చట్టాన్ని పాటించాలని స్పష్టం చేశారు.
ఇండోనేసియాలో షరియా చట్టం (Indonesia Sharia law Aceh) అమలవుతున్న ఏకైక రాష్ట్రం ఆచే. ఇటీవల చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కర్ర దండనలు తరచుగా విధిస్తున్నారు.
ఇదీ చదవండి: Afghanistan Taliban: కాళ్లు, చేతులు నరికే శిక్షలు మళ్లీ వస్తాయ్..