ETV Bharat / international

తాలిబన్ల అంతు చూస్తాం.. 'పంజ్​షేర్'​ తాజా ప్రకటన!

author img

By

Published : Aug 26, 2021, 11:28 AM IST

దేశాన్ని ఆక్రమించి.. తమవైపు దూసుకొస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు పంజ్​షేర్(Punjshir vally)​ సైనికులు. తాలిబన్ల అంతు చూస్తామని తాజాగా ప్రకటించారు. ముష్కరులను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ.. సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్నారు.

Punjshir, Taliban
పంజ్​షేర్, తాలిబన్​

తాలిబన్లపై(Afghanistan Taliban) సింహగర్జన చేస్తున్న పంజ్​షేర్(Punjshir vally)​ కోటకు బీటలు వారేలా కనిపిస్తున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. వనరుల లేమి దృష్ట్యా ముష్కర మూకతో పోరాటం, ఆపి సయోధ్య కుదుర్చుకోవాలని ఆ ప్రాంత పెద్దలు భావిస్తున్నారన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే.. ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెబుతున్నారు పంజ్​షేర్​ సైనికులు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశమే లేదని, యుద్ధానికి సిద్ధమని స్పష్టం చేశారు.

గతంలో తాలిబన్లపై సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. 'వారిని పాతాళానికి తొక్కేస్తాం' అని పంజ్​షేర్​ నేషనల్​ రెసిస్టెన్స్​ ఫ్రంట్​కు(ఎన్​ఆర్​ఎఫ్​) చెందిన ఓ సైనికుడు బుధవారం పేర్కొన్నట్లు అఫ్గాన్​ ఖామా ప్రెస్​ పేర్కొంది. ఇతర సైనికులు అందుకు మద్దతు పలుకుతూ.. తమ చేతులు పైకి ఎత్తి ' అల్లాహో​ అక్బర్​' అంటూ నినాదాలు చేశారు. తమ కంచుకోటపై తాలిబన్ల దాడిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఎన్​ఆర్​ఎఫ్​ బలగాలు(panjshir resistance).. మిషన్​ గన్​, మోర్టార్లతో కూడిన రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే.. అమెరికా తయారు చేసిన హమ్​వీస్​, పికప్​ ట్రక్కుల్లో ఆయుధాలతో తమ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా పహారా కాస్తున్నారు.

పంజ్​షేర్​ సింహంగా పేరున్న అహ్మద్​ షా మసూద్​ తనయుడు అహ్మద్​ మసూద్ నేతృత్వంలో.. అఫ్గాన్​ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాహ్​ సలేహ్​ మద్దతుతో.. తాలిబన్లపై పోరాటం సాగిస్తున్నారు.

Panjshir
పంజ్​షేర్​ సైనికుడు

తోకముడిచిన తాలిబన్లు..

యావత్​ దేశాన్ని తమ వశం చేసుకున్న తాలిబన్లు పంజ్​షేర్​ను హస్తగతం చేసుకునేందుకు భారీగా ఆయుధాలు, బలగాలతో వెళ్లారు. పంజ్​షేర్​ తమ వశం అవటం ఖాయంగా భావించిన వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత బుధవారం బదక్షన్​లోని అంజుమాన్​ మార్గం ద్వారా తాలిబన్లు పంజ్​షేర్​లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే.. ఎన్​ఆర్​ఎఫ్​ దళాలు ఎదురుదాడికి దిగాయి, ముష్కరమూకలపై తూటాల వర్షం కురిపించాయి. దాంతో తాలిబన్లు తోకముడుచుకుని వెనుదిరగక తప్పలేదు. ఈ పోరులో భారీగా తాలిబన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

పెరుగుతున్న మద్దతు..

తాలిబన్లపై పోరాడేందుకు ఉత్తర కూటమితో అఫ్గానిస్థాన్​ ఆర్మీ మాజీ కమాండర్​ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అలాగే.. అఫ్గాన్​ ప్రజలు సైతం వారికి మద్దతుగా నిలుస్తున్నారు. అఫ్గాన్​తో పాటు విదేశాల్లో సైతం తాలిబన్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ​మరోవైపు.. పొరుగుదేశం తజకిస్థాన్​ సైతం పంజ్​షేర్​ సైనికులకు మద్దతు పలికింది.

ఇదీ చూడండి: Panjshir valley: తాలిబన్లకు పంజ్‌షేర్‌ నుంచి సింహగర్జన..!

Afghanistan Taliban: తాలిబన్లపై ఎగిరిన తిరుగుబాటు జెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.