వన్యప్రాణులు గాయపడితే వారు చూస్తూ ఉండలేరు. వాటిని అక్కున చేర్చుకుంటారు. భౌతికంగా, మానసికంగా వాటికి చికిత్స అందిస్తారు. ఆస్ట్రేలియా కాన్బెర్రాలో కొంతమంది మహిళలు వన్యప్రాణుల సంరక్షకులుగా నిస్వార్థంగా సేవలందిస్తున్నారు.
మానసికంగా, భౌతికంగా గాయపడినట్లు కనిపించే వన్యప్రాణులైన బల్లులు, తాబేళ్లు, సరీసృపాల వంటి వాటిని ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. వాటికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వాటిని సంరక్షించే క్రమంలో కొంత మంది మానసిక వేదనకు గురవుతున్నారు.
ఓ చిన్న కంగారూ కూన సంరక్షణ చేపడుతున్నారు కాన్బెర్రా వాసి, వన్యప్రాణుల సంరక్షకురాలు సుజి నెదర్కాట్ వాట్సన్. జంతువుల సంరక్షణలో కొన్ని సార్లు బాధ, దుఃఖం నిండి తనకు ఆందోళన కలుగుతుందని అంటారామె.
"నేను ఈ ప్రపంచంలో దేనికి సరిగ్గా సరిపోతాననే విషయం చిన్న కంగారూ కూనని పెంచుతున్నప్పుడు నాకు తెలిసింది. అప్పుడు మిగితా విషయాలన్నీ నేను మరచిపోయాను. "
- సుజి నెదర్కాట్ వాట్సన్, వన్యప్రాణుల సంరక్షకురాలు.
వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటైన సంస్థలు వాటి రక్షణకు మరింతగా పాటుపడాలని కోరుతున్నారామె. భౌతికంగా గాయపడిన వాటితో పాటు మానసికంగా కుంగిపోతున్న జంతువులను గుర్తించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చూడండి: మహిళను చంపేసిన పోలీసు వాహనం