అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు (Afghan Taliban) పూర్తిగా తమ వశం చేసుకున్నప్పటికీ.. పంజ్‌షేర్ రాష్ట్రంపై ఎవరిది పైచేయి (Panjshir control) అనే విషయంపై సందిగ్ధం ఉండేది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తాలిబన్లు ప్రకటించగా.. పోరు కొనసాగుతోందని (panjshir conflict) పంజ్‌షేర్ నేతలు ప్రకటనలు చేయడం ఇందుకు కారణం. తర్వాత చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజ్‌షేర్ నేతలు తెలిపారు.
దీంతో పంజ్‌షేర్ ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉందనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా బయటకు వచ్చిన ఫొటోలను బట్టి.. ఈ ప్రాంతాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నారని అర్థమవుతోంది. పంజ్‌షేర్‌కు వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద తాలిబన్లు పహారా కాస్తున్నారు. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వారు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కీలక ప్రాంతాలన్నీ వారి కనుసన్నల్లోనే ఉన్నాయి.
పంజ్‌షేర్‌లో తాలిబన్లు... 'చిత్రమాలిక'
ఇదీ చదవండి: నిరసనలు ఆపేయండి.. పౌరులకు తాలిబన్ల హుకుం