చైనాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం పర్యటించడంపై ఆ దేశం సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. బృందం గురువారం చేరుకోనుందని చైనా జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది.
"కరోనా మూలాలు మిగతా దేశాల్లోనూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి డబ్ల్యూహెచ్ఓ ఇతర దేశాల్లో కూడా ఇటువంటి పర్యటనలు జరపాలి.
ఈ మహమ్మారి ప్రపంచలోని వివిధ ప్రాంతాల్లో పుట్టుకొచ్చిందని పరిశోధనలు చెబుతున్నాయి."
-జావో లిజిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
వూహాన్ వైరాలజీ సంస్థలోకి డబ్ల్యూహెచ్ఓ బృందాన్ని అనుమతించడంపై స్పందించేందుకు జావో నిరాకరించారు.
మేము మద్దతుగా ఉంటాం..
చైనా ప్రకటనపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టిఫెనీ డుజార్రిక్ స్పందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు తాము మద్దతుగా నిలుస్తామని అన్నారు.
"మహమ్మారిపై పోరాటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుంది. వైరస్ మూలాలను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. డబ్ల్యూహెచ్ఓ పర్యటన సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నాను."
-స్టిఫెన్ డుజార్రిక్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి
ఇదీ చదవండి : జపాన్లో కరోనా కొత్త వెర్షన్- ప్రపంచం పరేషాన్