చైనా సంస్థ సినోఫామ్ తయారుచేస్తున్న కొవిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఆధ్వర్యంలో పేద దేశాల్లో జరుగుతున్న టీకా కార్యక్రమానికి లక్షల కొద్దీ డోసులు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.
యూఎన్కు చెందిన యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓకు చెందిన అమెరికా ప్రాంతీయ కార్యాలయం ద్వారా రాబోయే వారాల్లో, నెలల్లో 'కొవాక్స్' పథకం కింద ఈ టీకాల పంపిణీ జరుగుతుంది.
ఇదీ చూడండి: మా టీకా సామర్థ్యం..79శాతం: చైనా
ఇదీ చూడండి: 'భారత్కు 2 కోట్ల టీకాలు- 30 మిలియన్ డాలర్ల సాయం'