ETV Bharat / international

చైనా ఆగడాలపై భారత్​కు వియత్నాం ఫిర్యాదు - పార్సిల్ దీవుల వివాదం

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా మరోసారి దందుడుకు చర్యలకు పాల్పడింది. పార్సిల్ దీవుల సమీపంలో ఫైటర్ ఎయిర్​క్రాఫ్ట్, బాంబర్​ను మోహరించి ఉద్రిక్త వాతావరణానికి తెరతీసింది. ఈ విషయంపై భారత్​కు వియత్నాం సమాచారం అందించింది.

CHINA INDIA VIETNAM
ఎయిర్​క్రాఫ్ట్
author img

By

Published : Aug 23, 2020, 6:19 AM IST

దుందుడుకు చైనా మరోసారి తెంపరితనం చూపించింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లో ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, బాంబర్‌ను మోహరించింది. అక్కడి ప్రశాంత పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చింది. భారత్‌లో వియత్నాం రాయబారి ఫామ్‌ సన్‌ చౌ ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. భారత్‌, వియత్నాం మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం అవసరమని నొక్కిచెప్పారు.

చాలా కాలంగా దక్షిణ చైనా సముద్రంలోని పార్సిల్‌ దీవులపై వివాదం నెలకొంది. అవి తమ ప్రాదేశిక ప్రాంతంలోనివే అని వియత్నాంను చైనా బెదిరిస్తోంది. కాగా వియత్నాంకు మద్దతుగా అమెరికా అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో అక్కడి పెద్దదైన వుడీ దీవిలో 'హెచ్‌-6జే' బాంబర్‌ను చైనా ఈ నెలంతా మోహరిస్తుందని వార్తలు వచ్చాయి. అది యూఎస్‌ యుద్ధ విమానాల ప్రభావాన్ని తగ్గించగలదని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

భారత్​కు ఫిర్యాదు..

చైనా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని వియత్నాం భారత్‌కు తెలిపింది. ఆ ప్రాంతంలో పరిస్థితులను డ్రాగన్‌ ఉద్రిక్తంగా మార్చిందని వెల్లడించింది. మన రెండు దేశాల మధ్య వ్యూహత్మర రక్షణ సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకోవాలని కోరింది.

వియత్నాంకు రుణం..

డ్రాగన్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ దక్షిణ చైనా సముద్రం తీరంలో చమురు, సహజవాయు నిక్షేపాలను అన్వేషించేందుకు భారత్‌ సహకారం కోరింది. కాగా తమ వద్ద గస్తీ పడవలు కొనుగోలు చేసేందుకు వియత్నాంకు భారత్‌ 100 మిలియన్‌ డాలర్లు రుణం ఇచ్చింది. ఇంకా రక్షణ సామగ్రిని కొనుగోలు చేసేందుకు మరో 500 మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది.

ఇదీ చూడండి: కరాచీలోనే డాన్​ దావూద్‌.. అంగీకరించిన పాక్‌‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.