ETV Bharat / international

కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్​కు తలవంపులు! - uyghurs, Tibetans and Hongkongers gathered

చైనా అవతరణ దినోత్సవమైన అక్టోబర్ 1నే డ్రాగన్ దేశ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్ర రూపు దాల్చాయి. చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ ఉయ్​గర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్​లో ఉయ్​గరులు, టిబెట్, హాంకాంగ్ పౌరులు నిరసన చేపట్టారు. హాంగ్​కాంగ్​లో నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది.

కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్​కు తలవంపులు!
author img

By

Published : Oct 2, 2019, 8:17 AM IST

Updated : Oct 2, 2019, 8:30 PM IST

కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్​కు తలవంపులు!

జాతీయ దినోత్సవం జరుపుకొన్న డ్రాగన్ దేశం చైనాకు అనుకోని సెగ తగిలింది. డ్రాగన్ విధానాలకు నిరసనగా ఉయ్​గర్స్, టిబెట్, హాంకాంగ్ పౌరులు ఆందోళన చేశారు. ప్రపంచ ఉయ్​గర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్​లో నిరసన వ్యక్తం చేశారు.

ఐరోపా సమాఖ్య పార్లమెంట్​కు చెందిన పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రాగన్ దేశం మానవ హక్కులను హరిస్తోందని ఆరోపించారు.

హింసాత్మకంగా హాంకాంగ్​..

చైనా జాతీయ దినోత్సవాలను నిరసిస్తూ హాంకాంగ్ వాసులు చేసిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. లక్ష మంది పౌరులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగగా, వారిని నియంత్రించేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు.

సిటీ యూనివర్శిటీ విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా ఒక పోలీసు అధికారి ఆందోళనకారుడిపై కాల్పులు జరిపాడు. తూటా గాయంతో కుప్పకూలిన 17 ఏళ్ల విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థిని పోలీసు కాల్చడం క్షణాల్లోనే..సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తర్వాత మరింత రెచ్చిపోయిన నిరసనకారులు గ్యాసోలీన్ బాంబులతో దాడులు చేశారు. అనేక వాహనాలకు నిప్పంటించారు.

పోలీసుల నిషేధాజ్ఞలు ఉల్లంఘించి చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్య వాదులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది చైనా వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 51 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బ్రిటన్ ఖండన

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై పోలీసుల దాడులను బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఆందోళనకారులపైకి నిజమైన బుల్లెట్లను వాడడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం

Patna (Bihar), Oct 1 (ANI): Rescue operations are underway by NDRF, SDRF teams in Bihar's Patna. They are rescuing patients stuck in Sai Hospital of Patna. Several parts of the state are battling with heavy rains and flood. Boats are also being used to rescue stranded residents in Patna. Heavy rain and flood threw normal life out of gear. Around 40 people have died due to the devastated floods in Bihar.
Last Updated : Oct 2, 2019, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.