ETV Bharat / international

US Airstrike: అమెరికా ప్రతీకారం- ఐసిస్ స్థావరాలపై డ్రోన్​ దాడులు!

అమెరికా ప్రతీకారం- ఐసిస్ సభ్యునిపై వైమానిక దాడి!

author img

By

Published : Aug 28, 2021, 7:15 AM IST

Updated : Aug 28, 2021, 11:55 AM IST

07:10 August 28

US Airstrike: అమెరికా ప్రతీకారం- ఐసిస్ స్థావరాలపై డ్రోన్​ దాడులు!

కాబుల్​ విమానాశ్రయం వద్ద ఐసిస్​-కే జరిపిన జంట ఆత్మాహుతి పేలుళ్లకు(Kabul Airport Blast ) అమెరికా ప్రతీకారం తీర్చుకుంటోంది. అఫ్గానిస్థాన్​లోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో  దాడులు(US Airstrike) చేసింది. ఈ నేపథ్యంలో కాబుల్ విమానాశ్రయాన్ని(Kabul Airport) ఖాళీ చేయాలని పౌరులను హెచ్చరించింది.

ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా ఐసిస్​-కే వ్యూహకర్త(ISIS khorasan) లక్ష్యంగా ఈ నంగహార్ ప్రావిన్సులో ఈ వైమానిక దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్​ అర్బన్ తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు.

కాబుల్​ విమానాశ్రయం వద్ద గురువారం జరిగిన జంట పెలుళ్ల ఘటనలో 180మందికిపైగా మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటాడి చంపుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం 48 గంటల్లోనే ఐసిస్ స్థవరాలపై అమెరికా సైన్యం మానవరహిత డ్రోన్​ దాడులు చేసింది.

Last Updated : Aug 28, 2021, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.