మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై బలగాలు జరిపిన కాల్పుల్లో 51 మంది చిన్నారులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. పిల్లలపై దాడులను ఆపాలని ఆ దేశ సైనిక బలగాలకు పిలుపునిచ్చినట్లు ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు.
"ఏప్రిల్ 13 నాటికి మయన్మార్ భద్రతా బలగాల చేతిలో 51 మంది పిల్లలు చనిపోయారు. మరో వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైనా పిల్లలు, యువతపై దాడులను ఆపాలని ఐరాస పిలుపునిస్తుంది" అని స్టీఫెన్ తెలిపారు. పిల్లలపై దాడికి మందుగుండు సామగ్రిని వినియోగిస్తున్నట్లు వస్తున్న నివేదికలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది.
దేశంలోని పలు నగరాల్లో ఆందోళనకారులు.. సైనిక కాల్పులకు బలయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. సైనిక దుశ్చర్యలో ఇప్పటివరకు దాదాపు 707 మంది పౌరులు మృతిచెందినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: 'దేశాల మధ్య సహకారంతో ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు'