ETV Bharat / international

'మూడో ప్రపంచ యుద్ధం వస్తే విధ్వంసమే' - రష్యా దాడులు

Ukraine Crisis: రష్యా భీకర దాడులు చేస్తున్న తరుణంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అంటూ సంభవిస్తే అణ్వాయుధాలతోనే జరుగుతుందని చెప్పారు. అది విధ్వంసకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Russia Ukraine War
రష్యా విదేశాంగ మంత్రి
author img

By

Published : Mar 2, 2022, 10:18 PM IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా ఏడో రోజూ తన దాడులను కొనసాగిస్తోంది. ఓ వైపు సైనిక దళాలు ఆ దేశంపై విరుచుకుపడుతుండగా.. ఇంకోవైపు ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అంటూ సంభవిస్తే అణ్వాయుధాలతోనే జరుగుతుందని, అది విధ్వంసకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ అణ్వాస్త్రాలు సేకరించేందుకు రష్యా అంగీకరించబోదని లావ్రోవ్‌ పేర్కొన్నారు. ఆంక్షలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూనే.. రష్యా సాంస్కృతిక రంగాన్ని లక్ష్యం చేస్తారని ఊహించలేదన్నారు. రష్యా అథ్లెట్లు, విలేకరులపై ఆంక్షలు విధించడం సరికాదని పశ్చిమ దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో రెండో విడత చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే, అమెరికా చెప్పినట్లు ఉక్రెయిన్‌ ఆడుతోందని ఆరోపించారు.

మరోవైపు రష్యానుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ భూమిలో పై చేయి సాధించినప్పటికీ.. దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పుతిన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ఇంకోవైపు రష్యా తన దాడులను యథాతథంగా కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ నగరాల్లో ఒకటైన ఖెర్సోన్‌ను దళాలను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం రష్యా దళాలు ప్రకటించాయి.

ఖర్కివ్‌లో 12గంటల కర్ఫ్యూ!

ఉక్రెయిన్‌పై రష్యా సేనల భీకర దాడుల నేపథ్యంలో ఖర్కివ్‌ నగరంలో కర్ఫ్యూ ప్రకటించారు. అక్కడి కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

'పుతిన్ ఓ యుద్ధ నేరస్థుడు'

ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఉక్రెయిన్‌లో పౌరులపై బాంబుదాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ని ఓ యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు.

ఇదీ చదవండి: పుతిన్​ ధైర్యం 'సెర్గీ'.. మరి జెలెన్​స్కీ వెనుక ఎవరున్నారు?

ఉక్రెయిన్​ నింగిపై పట్టు కోసం రష్యా తిప్పలు.. బాంబులు లేవా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.