తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే తీర ప్రాంత ప్రజలను నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవాలని సూచించింది అక్కడి ప్రభుత్వం.
ఫక్సాయి తుపాను సుమారు 2 వేల విద్యుత్ స్తంభాలను పడగొట్టింది. ఒక దశలో 9 లక్షల ఇళ్లకు పైగా విద్యుత్తు లేకుండా పోయింది. అందుకే ఈ తుపానును సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రజలను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. తమ వద్ద తగినంత ఆహారం, నీరు, ఫోన్లో ఛార్జ్ ఉండేలా చూసుకోవాలని కోరింది.
తుపాను తాకిడికి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండబోదేమోనని.. ప్రజలు నీళ్ల బాటిళ్లు, నూడుల్స్ వంటి ఆహార పదార్థాలు కొనడానికి సూపర్ మార్కెట్ల బాట పట్టారు.
తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైలు, విమాన సర్వీసులపై ప్రభావం పడనుంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుపాను కారణంగా రగ్బీ ప్రపంచకప్ మ్యాచ్ రద్దయింది. తీర ప్రాంతాల్లో పడవ ప్రయాణాలు నిలిపేశారు.
ఇదీ చూడండి:ఇరాన్ చమురు ట్యాంకర్‌పై రాకెట్ దాడులు