ETV Bharat / international

'డైమండ్ ప్రిన్సెస్​'లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

author img

By

Published : Feb 17, 2020, 9:36 PM IST

Updated : Mar 1, 2020, 4:04 PM IST

వైరస్ భయంతో జపాన్ తీరంలోనే నిలిపివేసిన నౌకలోని మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్-19 వైరస్​ సోకినట్లు జపాన్​లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. దీంతో వైరస్ సోకిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకున్నట్లు వెల్లడించింది. వారిని చికిత్స నిమిత్తం తరలించినట్లు స్పష్టం చేసింది.

cruise ship off Japan
డైమండ్ ప్రిన్సెస్

వైరస్​ భయంతో జపాన్​ తీరంలో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్-19 (కరోనా) వైరస్​ సోకినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో నౌకలో వైరస్ సోకిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరింది.

"వైరస్ సోకిన ఇద్దరు భారత సిబ్బందిని చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో కోవిడ్ సోకిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇదివరకే వైరస్ సోకిన నలుగురు భారత సిబ్బందికి చికిత్స కొనసాగుతోంది. వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది."-జపాన్​లోని భారత రాయబార కార్యాలయం

నౌకలో పరిస్థితులపై జపాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

మొత్తం 3,711 మందితో కూడిన నౌక ఈ నెల మొదట్లో జపాన్ తీరంలోకి ప్రవేశించింది. హంకాంగ్​లో దిగిన ఓ ప్రయాణికుడికి వైరస్ లక్షణాలు కనిపించడం వల్ల నౌకను యోకొహోమా తీరంలోనే నిలిపివేశారు. అప్పటి నుంచి నౌకను నిర్బంధంలో ఉంచారు. ఇందులో 138 మంది(ఆరుగురు ప్రయాణికులు, 132 మంది సిబ్బంది) భారతీయులు ఉన్నారు.

Last Updated : Mar 1, 2020, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.