ఉత్తర బంగ్లాదేశ్‌లో ఓ మసీదులోని ముస్లింలపై ఓ ఇస్లామిక్ బృందానికి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. గైబాంధ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.
స్వయం ప్రకటిత హెఫాజత్-ఇ-ఇస్లామ్‌కు చెందిన కార్యకర్తలు.. ఇమామ్(మసీదు పెద్ద) నుంచి మైక్ లాక్కున్న తమ సంస్థ గురించి బోధించారు. దీంతో ఘర్షణ తలెత్తినట్టు స్థానిక వార్తా సంస్థ నివేదించింది. ఈ క్రమంలో ముస్లిం వ్యక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై దాడి చేసి గాయపరిచారని ఇమామ్ మొబ్లోత్ ఉద్దీన్ అన్నారు.
అయితే.. మసీదు కమిటీపై భిన్నాభిప్రాయాలు ఉండటమే ఈ అవాంఛనీయ ఘటనకు కారణమని అక్కడి అధికారి ఒకరు తెలిపారు.
ఈ పూర్తి వ్యవహారంపై స్థానిక సుందర్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: తెరవెనుక భారత్-పాక్ చర్చలు.. నిజమెంత!