ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. కోలా బేర్​ మనుగడకు ముప్పు? - Thousands of koalas feared dead in Australia wildfires

ఆస్ట్రేలియా.. కోలా బేర్​ పుట్టినిల్లు. ప్రస్తుతం అక్కడ విస్తరిస్తోన్న కార్చిచ్చు వల్ల వీటి​పై అత్యధికంగా  ప్రభావం పడుతోంది. ఫలితంగా ఈ జాతి మనుగడకు ముప్పు కలిగే ప్రమాదం ఏర్పడింది. తాజాగా న్యూ సౌత్​వేల్స్​లోని సిడ్నీ ప్రాంతంలో శనివారం చెలరేగిన దావాగ్ని వల్ల వేల సంఖ్యలో కోలా బేర్​లు మరణించాయి.

wildfire koala
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. కోలా బేర్​ మనుగడకు ముప్పు?
author img

By

Published : Dec 28, 2019, 8:35 PM IST

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం విస్తరిస్తోన్న కార్చిచ్చు వల్ల అక్కడ జీవించే కోలా బేర్​ జాతికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. తాజాగా న్యూ సౌత్​వేల్స్​లోని ఉత్తర సిడ్నీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడం వల్ల వేల సంఖ్యలో కోలా బేర్​లు​ మరణించాయి. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రస్తుతం అక్కడ దాదాపు 28 వేలకు పైగా కోలా బేర్​లు​ నివసిస్తున్నాయి.... ఇటీవల విస్తరిస్తోన్న కార్చిచ్చు వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

ఇదీ చూడండి : కార్చిచ్చులో మూగజీవి నరకయాతన- కాపాడిన వీరనారి

ఆందోళన వ్యక్తం

ఇటీవల కార్చిచ్చు నుంచి తప్పించుకున్న కోలా బేర్​లు దాహార్తితో నీరు కోసం అలమటిస్తున్నాయి. అటుగా వెళ్లే బాటసారులు వాటికి నీరు అందిస్తోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు చలించిపోయి...అక్కడి పర్యావరణ మంత్రికి మెయిల్స్​ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.

"ఇప్పటికే 30 శాతం దాకా కోలా బేర్​లు ఆవాసాలు కాలి బూడిదయ్యాయి. దావాగ్ని పరిస్థితి అదుపులోకి రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం."

-సుశాన్​ లి, పర్యావరణ శాఖ మంత్రి

నష్టం

కార్చిచ్చు ధాటికి ఇప్పటికే అక్కడ 5 మిలియన్ల హెక్టార్ల మేర భూమి దగ్ధమైపోయింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 ఇళ్లు వరకు ధ్వంసమయ్యాయి.

ఇదీ చూడండి : కార్చిచ్చు: కోలా దాహం తీర్చిన 'నీటి'దాతలు

అత్యయిక పరిస్థితి

న్యూ సౌత్​ వేల్స్​ రాజధాని ఉత్తర సిడ్నీ ప్రాంతంలో శనివారం దావాగ్ని చెలరేగింది. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదయ్యాయి. పశ్చిమ శివారు ప్రాంతంలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత తాకగా... నగరంలో 31 డిగ్రీలు నమోదైంది. మరో ఏడు రోజుల వరకు ఈ ఉష్ణోగ్రతలే కొనసాగే అవకాశం ముందని వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈ స్థితిని అత్యయిక పరిస్థితిగా అభివర్ణించింది.

ఇదీ చూడండి : బాటిల్​ నీరు గడగడ తాగేసిన కోలా బేర్​!

Chennai, Dec 28 (ANI): Tamil Nadu Thowheed Jamath held a protest rally towards Governor Banwarilal Purohit"s residence on December 28 in Chennai. They are protesting against Citizenship (Amendment) Act and the proposed NRC. Large number of demonstrators took part in the anti-CAA rally. Nation-wide protests have intensified after implementation of the new Citizenship Act. The new Citizenship Act gives Indian citizenship to non-Muslim immigrants from three neighbouring countries i.e., Pakistan, Afghanistan and Bangladesh.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.