కార్చిచ్చు: కోలా దాహం తీర్చిన 'నీటి'దాతలు
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియా కార్చిచ్చు ప్రభావం అక్కడి జంతువులపైనా పడింది. అనేక మూగజీవులు ఆకలి, దాహంతో అలమటిస్తున్నాయి. తాజాగా ఈశాన్య అడిలైడ్‌లో కార్చిచ్చు అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బందికి కుడ్డీ క్రీక్ ప్రాంతంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ కోలా బేర్ కనిపించింది. సిబ్బంది తక్షణమే దానికి నీరు తాగించగా...కుదుట పడింది. ఎప్పటి నుంచి దాహం వేస్తుందో ఏమో గానీ బాటిల్ నీరు గటగట తాగేసింది. మరింత నీరు తాగేందుకు ఎగపడింది.