ETV Bharat / international

పోర్న్​సైట్​లో పాఠాలు.. ఏడాదికి రూ. 2కోట్ల సంపాదన! - పోర్న్​హబ్​

పోర్నహబ్​ అంటే సహజంగా పొర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఇదే సైట్​లో ఓ టీచర్​ 'లెక్కలు' చెబుతున్నాడు. గణితశాస్త్రంపై తనకున్న పట్టును వీడియోల రూపంలో పోర్న్​సైట్​లో పెడుతున్నాడు. పోర్న్​సైట్​లో లెక్కలు ఎవరు చూస్తారు? అని అనుకుంటే మీరు పొరబడినట్టే. ఆ వీడియోల ద్వారా ఆ మాస్టారు.. ఏడాదికి రూ.2కోట్లు సంపాదిస్తున్నాడు!

pornhub
'పోర్న్​సైట్​లో పాఠాలు.. ఏడాదికి రూ. 2కోట్లు'
author img

By

Published : Oct 28, 2021, 10:11 AM IST

తైవాన్​కు చెందిన చాంగ్​షూకు పోర్న్​హబ్​లో చాంగ్​షూమాత్​666 అని వెరిఫైడ్​ అకౌంట్​ ఉంది. వాస్తవానికి పోర్న్​హబ్​ కన్నా ముందు ఇంకొన్ని సైట్లలో గణితానికి సంబంధించిన వీడియోలు పెట్టాడు. అడల్ట్​ కంటెంట్​ను మాత్రమే స్వీకరించే ఆ సైట్లు​.. చాంగ్​షూ వీడియోలను తొలగించాయి. ఆ తర్వాత పోర్న్​హబ్​లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు చాంగ్​షూ. ఇతర సైట్లలాగా నిబంధనలు లేకపోవడం వల్ల పోర్న్​హబ్​లో అతడి వీడియోలు ప్రసారమయ్యాయి.

'అడల్ట్​ వీడియోలు ఉన్న చోట చాలా తక్కువమంది మ్యాథ్స్​ నేర్పిస్తారు. అయితే ఆ సైట్లను చాలా మంది చూస్తారు. అక్కడ వీడియోలు పెడితే చాలా మంది చూస్తారు అని అనిపించింది. వీడియోలు పోస్ట్​ చేశాను. ప్రజలు నా వీడియోలపై ఆసక్తి చూపించకపోవచ్చు. కానీ అడల్ట్​ వీడియోలు ఉండే చోట గణితానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని వారికి తెలుస్తుంది. ఇదేదో కొత్తగా ఉంది అనుకంటూ నా వీడియోలు చూస్తారు,' అని చాంగ్​షూ ఓ వార్తాపత్రికకు వెల్లడించాడు.

'వాస్తవానికి పోర్న్​హబ్​లో పాఠాలు చెప్పడం నా ఉద్దేశం కాదు. తైవాన్​కు చెందిన ఓ టీచర్​, లెక్కలు బాగా చెప్పగలడు అని ప్రపంచానికి తెలియజేయడం నా లక్ష్యం,' అని చాంగ్​షూ స్పష్టం చేశాడు. ప్రజలు పోర్న్​హాబ్​లోని నా వీడియోలు చూడాలి, అప్పుడే నా సిబ్బందికి డబ్బులు ఇవ్వగలను. లెక్కల గురించి మరిన్ని వీడియోలు చేయగలను.

పోర్న్​హబ్​లో గణిత వీడియోలు ఎవరు చూస్తారు? అనుకుంటే పొరబడ్డట్టే. తాను పెట్టే వీడియోలతో చాంగ్​షూ ఏడాదికి రూ. 2కోట్లు సంపాదిస్తున్నాడు.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా.. 'లెక్కలు అర్థం కావడం ప్రజలకు చాలా కష్టం. అందుకే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని, పోర్న్​హబ్​లోనూ తెగ చూసేస్తున్నారు,' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే చాంగ్​షూ చెప్పే పాఠాలు వినాలంటే, కచ్చితంగా పోర్న్​హబ్​ తెరవాల్సిన అవసరం లేదు. అతడి కంటెంట్​.. యూట్యూబ్​, ఇన్​స్టాలో కూడా అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి:- సీన్​ రివర్స్.. ఆ 'సూపర్​ హీరో'ను చుట్టుముట్టిన వివాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.