ETV Bharat / international

జపాన్ ఓడలోని మరో భారతీయుడికి కరోనా - japan cruise ship news

కొవిడ్​-19 వ్యాప్తి చెందుతుందన్న భయంతో జపాన్ తీరంలో నిలిపివేసిన ఓడలోని భారతీయ సిబ్బందిలో మరో వ్యక్తికి ఆ వ్యాధి సోకింది. మొత్తం 3వేల మందికి పైగా ఉన్న డైమండ్​ ప్రిన్సెస్​ షిప్​లో ఇప్పటి వరకు 218మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

coronavirus news
జపాన్ ఓడలోని మరో భారతీయునికి కొవిడ్​-19
author img

By

Published : Feb 14, 2020, 7:16 PM IST

Updated : Mar 1, 2020, 8:43 AM IST

కొవిడ్​-19(కరోనా) సోకుతుందన్న భయంతో జపాన్ తీరంలో నిలిపేసిన డైమండ్​ ప్రిన్సెస్​ షిప్​లోని మరో భారతీయునికి ఆ వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. ఓడ సిబ్బందిలోని భారతీయుల్లో ఇప్పటివరకు ముగ్గురికి ఈ మహమ్మారి సోకినట్లు జపాన్​లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని స్పష్టం చేసింది. ఓడలో మొత్తం 138 మంది భారతీయులున్నారు.

డైమండ్​ ప్రిన్సెస్ షిప్​లో మొత్తం 3,711మంది ప్రయాణికులుండగా.. 218 మందికి కొవిడ్-19 సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అమానుషం: బట్టలు విప్పి.. విద్యార్థినులకు తనిఖీలు

Last Updated : Mar 1, 2020, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.