అల్లరి, వింత చేష్టలతో మనుషులను ఆకట్టుకునే జంతువులలో ఒరంగుటాన్(అత్యంత అరుదైన కోతి జాతి) ఒకటి. ఇవి జూపార్క్‌లలో చేసే సందడి సందర్శకుల్లో బాగా ఉత్సాహాన్ని నింపుతాయి. తాజాగా ఇండోనేషియా బొగర్లోని తమన్ సఫారీ పార్క్‌లో ఇదే జరిగింది. ఓ ఒరంగుటాన్ చేసిన పని వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ జూ పార్క్‌ను సందర్శించడానికి వచ్చిన ఓ మహిళ ధరించిన స్టైలిష్ సన్‌గ్లాసెస్(కళ్లజోడు) అనుకోకుండా ఒరంగుటాన్లు ఉన్న ప్రాంతంలో పడిపోయింది. దాన్ని చూసిన ఓ తల్లి కోతి.. 'సోకులు మీకేనా మాకూ ఉంటాయి' అనుకుందో ఏమో.. ఆ కళ్లజోడు పడిపోయిన చోటుకు వెళ్లి దాన్ని కాసేపు పెట్టుకుని ఆస్వాదించింది.
కొద్దిసేపటికి ఆ కళ్లజోడును వీక్షకులు ఉన్న వైపునకు విసిరేసింది. ఈ సన్నివేశాన్ని ఆ మహిళ తన కెమెరాలో బంధించి నెట్టింట్లో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: పాండాల సందడికి నెటిజన్లు ఫిదా